“జగన్ భూతం ఇంకా రాష్ట్రాన్ని పట్టుకొని వ్రేలాడుతూనే ఉంది. దానిని శాస్వితంగా భూస్థాపితం చేస్తే తప్ప దాని నుంచి రాష్ట్రానికి విముక్తి లభించదు. భూస్థాపితం చేయకపోతే దాని వలన మళ్ళీ రాష్ట్రానికి, సమాజానికి ప్రమాదం కలుగవచ్చు,” అని సిఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిన్న జరిగిన గ్రామసభలో సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ గురించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్ళ జగన్ పాలనలో ఇంత స్వేచ్ఛగా ఎప్పుడైనా గ్రామ సభలు నిర్వహించుకున్నారా? ఏనాడైనా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు గ్రామసభలకు వచ్చారా?సిఎం వస్తున్నాడంటే ఆ చుట్టుపక్కల పచ్చటి చెట్లు నరికించేసేవారు. పరదలు కట్టేవారు.
పాఠశాలలు, దుకాణాలు బలవంతంగా మూయించేసేవారు. ప్రతిపక్షాలకు చెందిన నేతలను, కార్యకర్తలని గృహ నిర్బంధాలు చేసేవారు. వాలంటీర్లతో బెదిరించి భయపెట్టి ప్రజలను బలవంతంగా తన సభలకు రప్పించేవారు. మద్యలో ఎవరూ బయటకు పోకుండా పోలీసులను కాపలా పెట్టేవారు.
కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి, అవసరం లేదు. అందరూ స్వేచ్ఛగా రావచ్చు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మీతో పాటు కలిసి కూర్చొని మీ సమస్యల గురించి అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నాము,” అని అన్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ వాస్తవాలే కనుక ప్రజలు కూడా హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు రూ.990 కోట్లు విడుదల చేసిందని, త్వరలో మరో రూ.1100 కోట్లు విడుదల చేయబోతోందని చెప్పడంతో గ్రామ ప్రజలు హర్షధ్వానాలు చేశారు.
జగన్ ప్రభుత్వం పంచాయితీల నిధులు పక్కదారి పట్టించడంతో గ్రామాలలో సమస్యలు పేరుకు పోయాయని కానీ ఇప్పుడు నిధులకి కొరత లేదు కనుక ఇక నుంచి గ్రామాలలో అభివృద్ధి పనులు చురుకుగా సాగుతాయని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
నగరాలు, పట్టణాలలో అభివృద్ధి పనులు అందరి దృష్టిలో పడతాయి కనుక ప్రభుత్వాలు వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ గ్రామాభివృద్ధిని పెద్దగా పట్టించుకోవు. జగన్ ప్రభుత్వం కూడా అదే చేసింది. కానీ టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగానే గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించి నిధులు విడుదల చేయడం, ఇలా గ్రామ సభలు నిర్వహించడం చాలా అభినందనీయమే కదా?
ఇలా కూర్చుని గ్రామ సభలు పెట్టుకోవటం గత 5 ఏళ్ళలో ఎప్పుడైనా చూసామా? ఒక ముఖ్యమంత్రి ఇలా మీ ముందుకు వచ్చి మీతో కలిసిన సందర్భం ఉందా? నాడు ఆయన వస్తున్నాడు అంటే, చెట్లు కొట్టేసేవారు. పరదాలు కట్టేవారు. స్కూల్స్‌కి సెలవు ఇచ్చే వాళ్ళు. వ్యాపారాలు మూయించే వాళ్ళు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..… pic.twitter.com/PweBvnxbpC
— Telugu Desam Party (@JaiTDP) August 23, 2024
—




