ఎవరి మెడలు ఎవరు వంచుతారో చెప్పండి

Nara_Lokesh_TDPత్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకోవడానికి కేంద్రానికి వైసీపీ మద్దతు చాలా అవసరం. కనుక ఆనాడు ప్రత్యేకహోదా కోసం సిఎం జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటాలు నిజమైనవే అయితే ఇప్పుడు మా మద్దతు కావాలంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబట్టాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ సిఎం జగన్మోహన్ రెడ్డికి ట్విట్టర్‌లో సూచించారు.

“ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ-2సెలవిచ్చారు. స్పెషల్ స్టేటస్ సాధిస్తారని 22 మంది ఎంపీలని ప్రజలు మీకు ఇచ్చారు. ఎన్నికలకి ముందు ప్రత్యేకహోదా కోసం మీరు పోరాడింది నిజమే అయితే ప్రత్యేకహోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటించగలరా?మీరు మెడలు వంచుతారా? లేదా కేసుల మాఫీ కోసం మీరే తల దించుతారా జగన్ రెడ్డి గారు?” అని నారా లోకేష్‌ ట్వీట్ చేస్తూ ఆనాడు ప్రత్యేకహోదా గురించి జగన్మోహన్ రెడ్డి అన్నమాటలు, ముఖ్యమంత్రి అయిన తరువాత అన్న మాటల వీడియో క్లిప్పును కూడా జోడించారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories