కేంద్రం చేయాల్సింది లోకేష్‌ చేశారుగా!

Nara Lokesh ends Australia shrimp import ban

ముఖ్యమంత్రులు, మంత్రులు విదేశాలలో పర్యటించి రాష్ట్రాలకు పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు సాధించుకు రావడం చాలా కష్టమే కానీ ఇది సర్వసాధారణ విషయంగానే పరిగణింపబడుతుంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పెట్టుబడుల వేటకు వెళ్ళిన మంత్రి నారా లోకేష్‌ కూడా అదే చేస్తున్నారు. కానీ ఎవరూ ఊహించని విదంగా ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని రొయ్యల దిగుమతిపై విధించిన నిషేధం ఎత్తివేయించారు.

భారత్‌లో రొయ్యల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నంబర్: 1 స్థానంలో ఉంది. కానీ 2017లో భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసిన రొయ్యలలో తెల్లమచ్చ వైరస్ ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించి, నిషేధం విధించింది. అప్పటి నుంచి ఆస్ట్రేలియాకు రొయ్యాల ఎగుమతి నిలిచిపోవడంతో ఏపీలో రొయ్యల కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి.

ADVERTISEMENT

ఇటీవల భారత్‌ ఎగుమతులపై ట్రంప్‌ భారీగా సుంకాలు విధించడంతో అమెరికాకు కూడా రొయ్యల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో రొయ్యల కంపెనీలు ఇంకా నష్టపోతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో మంత్రి నారా లోకేష్‌ పెట్టుబడుల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు ఈ సమస్యపై ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మాట్లాడారు.

రొయ్యల నాణ్యత విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన కొన్ని షరతులకు మంత్రి నారా లోకేష్‌ అంగీకరించడంతో నిషేధం ఎత్తివేసింది. దీంతో సుమారు 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆంధ్రా నుంచి ఆస్ట్రేలియాకు పెద్ద ఎత్తున రొయ్యల ఎగుమతి ప్రారంభం కానుంది. భారత్‌ నుంచి విడుదేశాలకు ఎగుమతయ్యే రొయ్యాలలో 80 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఎగుమతి అవుతుంటాయి.

ఆస్ట్రేలియాకు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత రొయ్యల ఎగుమతి ప్రారంభం కాబోతుండటంతో రొయ్యల చెరువులు, రొయ్యల కంపెనీలలో మళ్ళీ అనేక మందికు ఉద్యోగాలు లభిస్తాయి కూడా.

ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం ఎత్తివేయడంతో ఆంధ్రాలో రొయ్యల చెరువుల యజమానులు, రొయ్యల ప్రాసెసింగ్ చేసే కంపెనీలు, వాటిని ఎగుమతి చేసే సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

నిజానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్యపై ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మాట్లాడి నిషేధం ఎత్తివేయించాలి. కానీ కేంద్రం నిర్లిప్తంగా ఊరుకోవడంతో రొయ్యల కంపెనీల గోడు వినే నాధుడే లేకుండా పోయాడు.

ఇప్పుడు నారా లోకేష్‌ చొరవ తీసుకొని ఈ సమస్యని పరిష్కరించడం విశేషం. పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు సాధించడమే కాదు… అవసరమైతే ఇటువంటి సమస్యలను కూడా పరిష్కరించగలనని మంత్రి నారా లోకేష్‌ నిరూపించి చూపారు.

ADVERTISEMENT
Latest Stories