ప్రభుత్వ పాఠాశాలలో ‘నో బ్యాగ్ డే’… అద్భుతం!

Nara Lokesh Implements No Bag Day in AP Government Schools

ఏపీ విద్యాశాఖ మంత్రిగా యువకుడు, ఉన్నత విద్యావంతుడు అయిన నారా లోకేష్‌ బాధ్యతలు చేపట్టగానే ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు మద్య దూరం తగ్గించడంతో మళ్ళీ పాఠాశాలలో చక్కటి వాతావరణం ఏర్పడింది.

సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తరచూ పాఠాశాలలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంతుండటంతో పండగ వాతావరణం కనిపిస్తోంది.

ADVERTISEMENT

ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్ధులని పరిగణనలోకి తీసుకునే మంత్రి నారా లోకేష్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాభోధనలో చక్కటి మార్పులు తీసుకువచ్చారు. కనుక చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. తాజాగా మరో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠాశాలలో ప్రతీ శనివారం ‘నో బ్యాగ్ డే’ విధానం అమలుచేస్తున్నారు. అంటే ఆ రోజు పిల్లలు బ్యాగులు, పుస్తకాలు లేకుండా పాఠాశాలలకు వస్తారన్న మాట!

పుస్తకాలు లేకుండా బడికి వస్తే ఏం చేస్తారు?అంటే ఆ రోజంతా ఆటపాటలే. వాటితో పాటు విద్యార్ధులలో దాగి ఉన్న ప్రతిభని బయటపెట్టే పనులు అంటే… బొమ్మలు గీయడం, తయారు చేయడం, నాటకాలు వేయడం, కధలు వ్రాయడం, చెప్పడం ఒకటేమిటి…. వారి అభిరుచికి తగ్గ పనులు చేసేందుకు ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారు.

కనుక విద్యార్ధులు చాలా ఉత్సాహంగా పాఠశాలలకు వస్తున్నారు. వారి ఆట పాటలతో, వారి కళా ప్రదర్శనలతో ఉపాధ్యాయులకు కూడా ఆరోజు చాలా సరదాగా గడుస్తుంది కనుక వారిపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. కనుక విద్యార్ధులకు దేనిపై అభిరుచి ఉందో ఉపాధ్యాయులు గుర్తింఛి వారు దానిలో రాణించేందుకు తోడ్పడగలరు.

ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్ధులు అందరూ కలిసి సరదాగా గడపడం వలన చదువుల ఒత్తిడి తగ్గి వారి మద్య అనుబందం పెరుగుతుంది. కనుక చదువులలో రాణించేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుంది. కనుక ‘నో బ్యాగ్ డే’ ఉత్తమ ఫలితాలు ఇచ్చే ఓ చక్కటి ఆలోచనే అని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories