
నేటి నుంచి మూడు రోజుల పాటు కడపలో అంగరంగ వైభవంగా టీడీపీ మహానాడు సభలు జరుగనున్నాయి. ఓ రాజకీయ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఓ రకంగా ఉంటుంది. గెలిచి అధికారంలో ఉన్నప్పుడు జరుపుకుంటే అది మరో రకంగా ఉంటుంది.
Also Read – మిథున్ రెడ్డి ఏ-4 అంటే సరిపోదు…
తెలంగాణలో బిఆర్ఎస్, ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అటువంటి పరిస్థితిలో ఉండగా ఏపీలో కూటమిలో టీడీపీ, జనసేనలు విజయోత్సాహంతో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాయి.
తెలంగాణలో చాలా బలహీనపడిన బిఆర్ఎస్ పార్టీ గత నెల 27న రజతోత్సవ సభ జరుపుకుంది. ఆ సభలో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించారు.
Also Read – రేపు రెంటపాలకు జగన్.. ఏం ప్లాన్ చేశారో?
ఆ సభ తర్వాత కేసీఆర్ మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటారని, అప్పుడు బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆ సభ తర్వాతే కల్వకుంట్ల కుటుంబంలో లుకలుకలు బయటపడ్డాయి!
సాక్షాత్ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తండ్రిని విమర్శిస్తూ లేఖ వ్రాయడం, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని విమర్శించడంతో బిఆర్ఎస్ పార్టీ డొల్లతనం బయటపడింది.
Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసులో.. జగన్ కూడా?
ఇక్కడ ఏపీలో ఐదేళ్ళ జగన్ పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ముఖ్య నేతలని, కార్యకర్తలని ఎంతగా వేధిస్తున్నా, అట్టహాసంగా మహానాడు నిర్వహించుకున్నారు. ఆ సభలలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులలో ధైర్యం నింపగలిగారు.
నారా లోకేష్ కూడా ‘యువగళం పాదయాత్ర’తో పార్టీని మరింత బలోపేతం చేశారు. ప్రజలను ఆకర్షించి పార్టీకి మద్దతు కూడగట్టి ఎన్నికలలో కూటమి పార్టీలను గెలిపించుకున్నారు. కనుక అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు లేనప్పుడు కూడా టీడీపీ అంతే ధృడంగా, నిబ్బరంగా ఉండగలదని టీడీపీ నిరూపించి చూపింది.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరూ కూడా పట్టు వదలని విక్రమార్కులు వంటివారని చెప్పేందుకు ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలున్నాయి.
వారి నాయకత్వంలో టీడీపీ ఒడిదుడుకులు తట్టుకొని ముందుకు సాగగలదని, ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రాగలదని నిరూపితమైంది. కనుక ఈ మహానాడులో నారా లోకేష్‌కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి కల్పించబోతున్నట్లు తెలుస్తోంది.
సిఎం చంద్రబాబు నాయుడు తన సందేశంలో మహానాడులో యువగళంకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పడం కూడా ఇదే సూచిస్తోంది.
ఒకవేళ నారా లోకేష్‌కి ప్రమోషన్ ఇస్తే, టీడీపీ భవిష్యత్ దృష్ట్యా ఇది చాలా అవసరమే.. కీలకమే అని చెప్పవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలకు బీజం అవుతుంది.