జగన్ రాజ్యంలోనే ఇటువంటివన్నీ జరుగుతాయి

Nara_Lokesh_TDP_Former_Ministerశ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి మండలంలో చిల్లకొండయ్యపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం ఓ ఆటోపై హాటెన్షన్ విద్యుత్‌ వైరు తెగిపడటంతో ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

విద్యుత్‌ వైర్లను బిగించి ఉన్న ఇనుప క్లాంపుపై ఓ ఉడుత దూకడంతో ఒక్కసారిగా ఎర్తింగ్ అయ్యి విద్యుత్‌ తీగలు షార్ట్ సర్క్యూట్ అయ్యి తెగిపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు చెప్పడంపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఘాటుగా స్పందించారు.

ADVERTISEMENT

ముందుగా మృతులకు నివాళులు ఆర్పిస్తూ “శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి గ్రామం వద్ద ఆటోపై హైటెన్షన్ విద్యుత్‌ తీగలు పడి ఐదుగురు మృతి చెందిన ప్రమాదం నన్ను తీవ్రంగా కాలిచివేసింది. మృతులకు నివాళులు ఆర్పిస్తున్నాను,” అని ట్వీట్ చేశారు.

తరువాత “తేనెతీగల వలన రధం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడుత వలన హైటెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి. ఇంకా నయం… కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తుండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పలేదు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే కనీస విచారణ జరుపకుండానే అధికారులతో కట్టుకధల కహానీలు చెప్పించడం వైసీపీ సర్కారుకి అలవాటైపోయింది,” అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.

ప్రభుత్వోద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలో నుంచి రూ.800 కోట్లు రాత్రికి రాత్రి మాయం అవడంపై స్పందిస్తూ, “వినేవాళ్ళు ఆంధ్రప్రదేశ్‌ జణమైతే, చెప్పేవాడు జగన్ మోసపు రెడ్డి. అవగాహన లేకే సిపిఎస్ రద్దు హామీ ఇచ్చామన్నారు. జీపీఎఫ్ డబ్బు మాయం చేసి సాఫ్ట్‌వేర్‌ సమస్యగా చిత్రీకరిస్తున్నారు. నిధులు లేకే సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయం రద్దు చేశాం అంటున్నారు. రేపో మాపో శనివారం సెలవు రద్దు చేసి ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసమే అని చెపుతారు చూడండి.” అని ట్వీట్ చేశారు.

ADVERTISEMENT
Latest Stories