అవును.. మేం పిల్ల సైకోలం.. మారే ప్రసక్తేలే!

YCP Cadre

పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతోనే పోవాలి తప్ప మద్యలో పోవని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆంధ్రాలో వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం రెచ్చిపోయి రౌడీ మూకల్లా ప్రవర్తించిన వైసీపీ శ్రేణులు, అధికారం ఊడిపోయినా ఇంకా తీరు మారలేదు. ఇంకా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే, అది పుట్టుకతో వచ్చిన బుద్దులు గనుక.

ఇబ్రహీంపట్టణంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఆదివారం ఉదయం ఓ శుభకార్యం జరిగింది. ఆయన అనుచరులు పార్టీ జెండాలు పట్టుకొని ఊరేగింపుగా ఆయన ఇంటికి బయలు దేరినప్పుడు దారిలో రోడ్డుపై ఓ చిన్న పిల్లాడు తన చిన్న సైకిల్‌ని తొక్కుతూ తిరుగుతున్నాడు.

ADVERTISEMENT

అప్పుడు జోగి రమేష్ అనుచరులలో ఒకడు ఆ పిల్లాడి చేతిలో నుంచి ఆ సైకిల్ లాక్కొని గిరగిరా తిప్పుతూ ఎత్తి నేలకేసి కొట్టి కాలితో తొక్కి ముక్కలు చేశాడు. అతను ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు మిగిలినవారు కూడా చప్పట్లు కొడుతూ అతనిని ఉత్సాహపరచగా, మరికొందరు ఆ పిల్లాడి సైకిల్‌ని ముక్కలు ముక్కలు చేశారు.

వారు అలా రోడ్డుపై వికృత చేష్టలు చేస్తుంటే మరికొందరు తమ మొబైల్ ఫోన్లలో ఆ దృశ్యాలు చిత్రీకరించారు. వాళ్ళు తన సైకిల్ ఎందుకు లాక్కున్నారో, ఎందుకు ముక్కలు చేస్తున్నారో అర్దం కాక ఆ పిల్లాడు ఏడుస్తుంటే వైసీపీ మూకలు పైశాచిక ఆనందంతో ఇంకా రెచ్చిపోయారు.

వాళ్ళే ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టుకున్నారో మరెవరో పెట్టారో తెలీదు కానీ ఇది మంత్రి నారా లోకేష్‌ దృష్టికి రావడంతో ఆయన దానిని రీట్వీట్ చేస్తూ, “అబ్బే వాళ్ళేమీ మారలేదు….. వాళ్ళేమీ మారరు కూడా….. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో… ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు.

అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ… వాళ్ళకి సైకో నాయకుడు! ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ళ ఆలోచనలను…. చిన్న పిల్లవాడి చేతిలో నుండి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ విరగ్గొడుతూ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింత గా అర్థం చేసుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను.

మైలవరం లో ఓ మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చి వాళ్ళు చేసిన పిచ్చి చేష్టలు తీవ్రంగా ఖండిస్తున్నా,” అని ట్వీట్ చేశారు.

ADVERTISEMENT
Latest Stories