పేటీఎం డాగ్స్… చట్టం ముందు వైఎస్‌ను ముద్దాయిగా నిలబెట్టింది మీ జగనే

Nara Lokesh YS Jagan YSR Vennupotuఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీపై టిడిపి వాదనలను తిప్పి కొట్టేందుకు వైసీపీ నేతలు చేస్తున్న వాదనలతో వారు అనవసరంగా ఎప్పుడో చనిపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతిపై చర్చ జరిగేలా చేస్తున్నారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఇదే విషయం వైసీపీ నేతలకు చెప్పుతో కొట్టినట్లు అర్దమయ్యేలా చెప్పారు. మాజీ కాంగ్రెస్‌ ఎంపీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడుగా పేరుపొందిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కొంతకాలం క్రితం టీవీ9 న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

దానిలో “వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చట్టం ముందు ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టింది ఆయన కుమారు జగన్మోహన్ రెడ్డే కదా?ఆరోజు అక్రమాస్తుల కేసులో ఎఫ్ఐఆర్‌లో తన పేరు చేర్చినందుకు జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టుకి వెళ్ళి, తన తండ్రి మంత్రివర్గం తీసుకొన్న నిర్ణయాలతో తనకు సంబందం లేదని కేసు వేశారు. తద్వారా ఈ కేసులో మొదటి ముద్దాయిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలబడాల్సి వచ్చింది,” అని అన్నారు.

ADVERTISEMENT

నారా లోకేష్‌ ఈ ఇంటర్వ్యూ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, “పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్ ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే,” అంటూ ట్వీట్ చేశారు.

ADVERTISEMENT
Latest Stories