లోకేష్‌ది ఈవినింగ్ వాక్ కాదురా అబ్బాయిలు… మారధన్!

Nara-Lokesh-Yuvagalam-Padayatra-Continues-Midnightటిడిపి యువనేత నారా లోకేష్‌ ఇప్పటికే 2500 కిమీ యువగళం పాదయాత్ర పూర్తిచేయగా ఆదివారం మరో సరికొత్త రికార్డు సృష్టించారు. విజయావాడ నగరంలో గుండా సాగుతూ నిర్విరామంగా 12 గంటలసేపు పాదయాత్ర చేస్తూ సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కృష్ణా జిల్లాలోని నిడమనూరులోని గన్నవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. నారా లోకేష్‌తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా అంతే ఉత్సాహంతో ముందుకు సాగారు. మద్యలో వర్షం పడినా ఎక్కడా ఆగకుండా ముందుకు సాగుతూ గన్నవరం నియోజకవర్గంలో అడుగుపెట్టారు. నారా లోకేష్‌ వస్తున్నారని తెలిసి దారిలో పలుచోట్ల ప్రజలు ఆయన కోసం అర్దరాత్రి అయినా ఎదురుచూసారు. ఇక టిడిపి కార్యకర్తల సంగతి చెప్పక్కరలేదు. పార్టీ జెండాలు పట్టుకొని ఎదురుచూస్తూ, ఆయన రాగానే ఉత్సాహంగా కలిసి ముందుకు సాగారు.

గన్నవరం నియోజకవర్గం ‘నా అడ్డా’ అంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తొడగొడుతూ ఉంటారు. కానీ పెనమలూరులో ప్రజలు తెల్లవారు జామున 2 గంటలవరకు నారా లోకేష్‌ కోసం మేల్కొని ఎదురుచూశారు. నారా లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు.

ADVERTISEMENT

వల్లభనేని వంశీ అనుచరులు కొన్ని నెలల క్రితం గన్నవరంలోని టిడిపి కార్యాలయాన్ని, దాని ముందు పార్క్ చేసిన టిడిపి నేతల కార్లను తగులపెట్టిన సంగతి తెలిసిందే. కనుక వంశీ సవాలుకి జవాబుగా నేడు నారా లోకేష్‌ గన్నవరంలో లక్షమందితో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. గన్నవరంలో ఇంతవరకు కనీవిరుగని స్థాయిలో ఈ బహిరంగసభ ఉంటుందని టిడిపి నేతలు చెపుతున్నారు.

అంతకు ముందు వైసీపీ సీనియర్ నేత యార్లగడ్డ వెంకటరావు పార్టీకి గుడ్ బై చెప్పేసి నిన్న హైదరాబాద్‌ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. గన్నవరం టికెట్‌ ఇస్తే గెలిచి బహుమతిగా అందిస్తానని హామీ ఇచ్చారు. అందుకు చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.

కనుక యార్లగడ్డ వెంకటరావు, ఆయన అనుచరులు కూడా టిడిపిలోకి వస్తుండటంతో గన్నవరంలో టిడిపి, వైసీపీ బలాబలాలు మారనున్నాయి. ఈరోజు గన్నవరం బహిరంగసభలో నారా లోకేష్‌ సమక్షంలో యార్లగడ్డ వెంకటరావు, ఆయన అనుచరులు టిడిపిలో చేరబోతున్నారు. కనుక వారందరూ కూడా గన్నవరం నియోజకవర్గంలో నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర, బహిరంగసభని విజయవంతం చేసేందుకు టిడిపి నేతలతో చేతులు కలిపి పనిచేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories