Nara-Lokesh-Yuva-Galama-Padayatra-TDP-Kadapaతెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని అధిగమించాడు అదీ ఆయన సొంత జిల్లా కడపలోనే. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడిగా వైయస్ పాదయాత్ర చేసారు, ఆ యాత్రలో భాగంగా 68 రోజులలో 11 జిల్లాల పరిధిలో54 నియెూజకవర్గాలను చుడుతూ 1475 కి.మీ. నడిచారు. ఆ యాత్ర వల్ల కాంగ్రెస్ కు ఎటువంటి ప్రయెూజనం కలిగిందో గానీ వైయస్ మాత్రం పార్టీలో కోట్ల, నేదురుమల్లి, మైసూరా, డియస్ వంటి తన పోటీదారులను దాటుకుని కుర్చీ పోటీలో ముందు వరుసలోకి వచ్చారు. తెలుగుదేశం అనుకూల మీడియాలు కూడా దానికి పెద్ద ఎత్తున కవరేజ్ ఇచ్చి ప్రజల్లోకి వెళ్లడానికి ఉపయెూగపడ్డాయి. స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుండి ఈ దేశంలో అనేక పాదయాత్రలు, ఇతర రాజకీయ, సామాజిక పోరాటాల యాత్రలు జరిగినా కొత్తగా వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వల్ల వైయస్ చేసిందే మెుదటి పాదయాత్రా అన్నట్టు ఆయన అభిమానులు ప్రచారం చేసారు. ఆ తరువాత చంద్రబాబు అంత కంటే ఎక్కువ దూరం ‘వస్తున్నా మీకోసం’ అంటూ, వైయస్ జగన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ అంటూ చేసి అధికారం సాగించారు.

ప్రస్తుతం తెలుగుదేశం యువ నాయకుడు ‘యువగళం’ అంటూ పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆయన 117 వ రోజు మైదకూరులో 1509 కి.మీ. పూర్తి చేసారు. ఆవిధంగా ఆయన వైయస్ చేసిన యాత్రను ఆయన సొంత జిల్లాలో, అదీ ఆయన బావమరిది నియెూజకవర్గమైన కమలాపురంలోనే అధిగమించడం విశేషం. వాస్తవానికి వైయస్ 1475 కి.మీ. మాత్రమే యాత్ర చేసినా ఒక సెక్షన్ మీడియా దానిని 1500 కి.మీ. అనీ, 68 రోజుల యాత్రను 64 రోజులు అంటూ ప్రచారం చెయ్యడం వల్ల లోకేష్ 1500 మైలు రాయిని ప్రామాణికంగా తీసుకోవలసి వచ్చింది లేకుంటే ఆయన 1475 కి.మీ. దూరం తన 114 రోజుల యాత్రలో మైదకూరులోనే అధిగమించారు.

వైయస్ యాత్రను, లోకేష్ యువగళం యాత్రని పోల్చి చూస్తే, ఇద్దరి యాత్రల్లో మండుటెండలు ఉన్నాయి. వైయస్ చేసిన సమయంలో 44.6 డిగ్రీల వరకు ఎండలు నమెూదైతే, ఇప్పుడు 46.5 డిగ్రీల ఎండలు కూడా నమెూదౌతున్నాయి. పాదయాత్ర చేసినప్పటి వైయస్ వయసు కంటే చిన్నవాడు కావడం ఒక్కటే లోకేష్ కు అనుకూలం అయితే మిగిలినవి దాదాపు ప్రతికూలంగానే ఉన్నాయి. లోకేష్ యాత్ర చేస్తాడనే వార్త రాగానే జగన్ రెడ్డి ప్రభుత్వం యాత్రలను కట్టడి చేస్తూ జి.వో నెం. 1 తెచ్చింది. ఇక అనుమతులు కూడా చివరి నిమిషం వరకు ఇవ్వకుండా, రకరకాల కొర్రీలు వేస్తూ, సవాలక్ష షరతులతో అనుమతులు ఇచ్చారు. ఇక యాత్ర మెుదలైన మెుదటి రోజు నుండే వైసిపి తన సోషల్ మీడియాల్లో లోకేష్ మీద దాడులు మెుదలు పెడితే, అధికార యంత్రాంగం డివిజన్ డివిజన్ కి కొత్త షరతులు పెడుతూ అడుగడుగునా అవరోధాలు సృషించింది. తొలి మూడు వారాల యాత్రలోనే లోకేష్ పై పోలీసులు 5 కేసులు పెట్టారంటే ఎంత కట్టడి చేసారో ఆలోచించవచ్చు. లోకేష్ ప్రచారరధం సీజ్ చేస్తే ఆయన ఒక చోట రోడ్డు పక్క మిద్దె ఎక్కి మాట్లాడారు. తరువాత ఆయన మైక్ సీజ్ చేస్తే కుర్చీ ఎక్కి మైక్ లేకుండానే మాట్లాడారు, చివరకు కుర్చీ కూడా లాక్కుంటే ఆయన రోడ్డు మీద నిలబడే మాట్లాడారు. అలా తొలి రెండు నెలలు అడుగడుగునా అవాంతరాలు కల్పించారు. ఇక వైయస్ కు మాత్రం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి అనుమతులు, భద్రత కల్పించి ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వం తరపున పూర్తిగా సహకరించారు. ఇటు లోకేష్ యాత్రలో కొన్ని చోట్ల వైసిపి మూకలు దాడులకు పాల్పడితే, జగన్ రెడ్డిప్రభుత్వం తిరిగి టిడిపి కార్యకర్తలపైన కేసులు పెట్టింది, కానీ వైయస్ యాత్ర సమయంలో ఆయన యాత్ర వెనుక ఒక వాహనంలో కొందరు వస్తున్నారని ఆరోపించగానే బాబు ప్రభుత్వం స్పందించి వారిని అదుపులోకి తీసుకుంది. అలా అనుమతులు, భద్రత వంటి విషయాల్లో వైయస్ యాత్ర సులువుగా జరిగితే, లోకేష్ అధికార పార్టీ నుండి, ప్రభుత్వం నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.

రెండొవది స్పందన. వైయస్ యాత్ర సగం వరకు పెద్దగా కాంగ్రెస్ వారు కూడా పట్టించుకోలేదు. ఆయన తన వెంట ఉన్న మందీ మార్బలం ఒక ఐదారు వందల మందితో ప్రొద్దుట బయలుదేరి అలా నడుచుకుంటూ, ఎదురు వచ్చే వారికి అభివాదం చేసుకుంటూ సాగిపోయే వారు. మద్యలో అక్కడక్కడ ఒక ఐదు పది నిమిషాలు మాటా మంతి తప్ప పెద్ద జనాలు, స్పందన ఉండేది కాదు. అందువల్ల ఆయన రోజుకు 22 కి.మీ. పైన నడవ గలిగేవారు. వైయస్ యాత్ర సగంలో ఆయనకు చిన్న అనారోగ్యం చేసి ఆయన గురించి అభిమానులు కాస్త ఆందోళన చెందారు, మీడియా కూడా ఆ విషయం మీద ప్రచారం చేసిన తరువాతనే వైయస్ యాత్రకు స్పందన పెరిగింది. లోకేష్ విషయంలో తొలి రోజు నుంచి అపూర్వ స్పందన వచ్చింది. అప్పటి వరకు మాట తీరు విషయంలో లోకేష్ పై ఉన్న అనుమానాలు తన వాగ్దాటితో తీరిస్తే, ప్రభుత్వ నిర్భందం వల్ల టిడిపి కార్యకర్తలు మరింత కసిగా తోడు వచ్చారు. ఇక రోజూ యాత్ర మెుదలయ్యే ముందు గంటకు పైగా 1500 ఆపైన అభిమానులతో సెల్ఫీలు దిగుతున్నారు. ఇక తన యాత్రలో ప్రతి చోట గతంలో తాము చేసిన అభివృద్ధి, తెచ్చిన కంపనీలు, ప్రస్తుత అధికార పార్టీ నాయకుల అక్రమాలపై సెల్ఫీతో చైతన్యం తెస్తూ, లోకేష్ సెల్ఫీ చాలెంజ్ అనే ట్రెండ్ తీసుకువచ్చారు. లోకేష్ యాత్ర తొలి ఫలం కూడా యాత్ర మెదలైన నెల రోజులకు జరిగిన యంయల్సీ ఎన్నికల్లో ప్రజలు నేరుగా ఎన్నుకునే రాయలసీమలోని రెండు గ్రాడ్యుయేట్ స్థానాల రూపంలో అందాయి. ఇక వైయస్ 11 జిల్లాలలో 54 నియెూజకవర్గాలు చుడితే లోకేష్ నాలుగు జిల్లాలలోనే దాదాపు 40 వరకు చుట్టేసారు. అలా ఇప్పటికే అనేక మైలు రాళ్ళు దాటుతూ, ప్రతి వంద కి.మీ. ప్రజలకు ఒక హామీ ఇస్తూ దాదాపు అన్ని రకాలుగా తన యాత్ర విజయపథంలో సాగుతూ ముందుకు వెళుతున్నారు.

శ్రీకాంత్.సి