Nara Lokesh

చంద్రబాబు అరెస్టుతో బాబు మొదలు పెట్టిన భవిష్యత్ కి గ్యారంటీ.., లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలకు తాత్కాలికంగా బ్రేకులు వేసిన టీడీపీ ఇప్పుడు వాటిని తిరిగి పునరుద్దరించే చర్యలు చెప్పట్టిందంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ యువగళంతో సామాన్య ప్రజలకు, యువతకు దగ్గరైన లోకేష్ ప్రత్యర్థులకు మాత్రం పక్కలో బల్లెంలా తయారయ్యాడు.

యువగళం పేరుతో లోకేష్ పాదయాత్రలు చేస్తూ స్థానిక ప్రజలతో మమేకమవ్వడం, అక్కడి సమస్యలను అడిగి తెలుసుకోవడం, ముఖ్యంగా యువతతో మాట మంతి కార్యక్రమాలు చేపడుతూ వారడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో బదిలిస్తూ, ప్రత్యర్థుల విమర్శల పై ధీటైన జవాబులిస్తూ రాజకీయాలలో ఒక మెట్టు ఎక్కారనే చెప్పాలి. గతంలో ప్రత్యర్థులు తన పై చేసిన ప్రతి విమర్శను సీరియస్ గా తీసుకున్న లోకేష్ లోపాలను సరిచేసుకుంటూ ముందగు వేస్తున్నారు.

Also Read – మూగబోయిన టాలీవుడ్…!

యువగళంతో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న టీడీపీ క్యాడర్ లో తిరిగి నూతనోత్సాహం కలిగించేందుకు, పార్టీని, పార్టీ నేతలను తిరిగి ప్రజాక్షేత్రానికి చేరువ చేయడానికి ఈ యాత్ర టీడీపీ పార్టీకి ఎంతో అనుకూల అంశం అవుతుంది.చంద్రబాబు అరెస్టు, ఆ తరువాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో ప్రతిపక్షాల మీద పై చేయి సాధించిన జగన్ ప్రభుత్వానికి ఈ యువగళంతో సరైన సమాధానం చెప్పడానికి అటు టీడీపీ నేతలతో పాటు టీడీపీ క్యాడర్ కూడా ఆసక్తి కనపరుస్తుంది.

టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన తరువాత టీడీపీ చేపడుతున్న యాత్ర కావడంతో క్షేత్ర స్థాయిలో పొత్తు అంశం ఎంత మేరకు అనుకూల ఫలితాలను ఇస్తుందో, పొత్తుకు కలిగే అవరోధాలు ఏమిటో తెలుసుకోవడానికి, వాటిని సరిదిద్దడానికి కూడా టీడీపీ పార్టీకి ఇటువంటి యాత్రల అవసరం ఎంతైనా అవసరం.నవంబర్ మొదటి వారంలోనే లోకేష్ రాష్ట్ర రాజకీయాల పై ద్రుష్టి సారిస్తారు అనుకున్న టీడీపీ క్యాడర్ కు నిరాశే మిగిలింది. కనీసం ఇప్పుడైనా లోకేష్ రాష్ట్ర రాజకీయాల పై ద్రుష్టి పెట్టి తన యాత్రలను తిరిగి ప్రారంభించి అధికార పార్టీ పై దండయాత్ర కొనసాగించాలని టీడీపీ శ్రేణులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Also Read – అవసరం లేనప్పుడు రివర్స్ గేర్.. ప్రమాదమేగా?

అయితే ఆ నెల 24 రాజోలు నుంచి తిరిగి యువగళం ప్రారంభించడానికి టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇచ్ఛాపురంలో ముగింపు పలకాల్సిన యువగళం విశాఖతో ముగించే ఆలోచనలో లోకేష్ ఉన్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర కూడా విశాఖలోనే ముగించడంతో అదే ఆనవాయితీని అనుసరించాలని పార్టీ వర్గాలు కూడా భావిస్తుండడంతో విశాకనే యువగళానికి ఫైనల్ డెస్టినీ అంటూ వార్తలు ఊపందుకున్నాయి.

చంద్రబాబు సాధారణ బెయిలు పిటిషన్ పై తీరు రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానాలు తీర్పుని వెలువరించిన తరువాతనే లోకేష్ తన యువగళం పై ప్రకటన చేసే అవకాశం ఉందంటూ మరికొన్ని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీనూ అతి తొందరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న లోకేష్ “యువగళం 2 . 0 ” అనేది సుస్పష్టం అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

Also Read – డాడీ నన్ను కొట్టారు… అరెస్ట్ చేయండి!