కేంద్రప్రభుత్వంపై తెదేపా, వైకాపా పెట్టిన అవిశ్వాస తీర్మానాలపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ స్పందించారు. అవిశ్వాస తీర్మానాలు తనకు అందాయని.. అయితే సభ సజావుగా జరిగితేనే వీటిని ప్రవేశపెట్టగలమని పేర్కొన్నారు. ఇలాగే గందరగోళ పరిస్థితులు నెలకొంటే తీర్మానాలను తీసుకురాలేమని స్పష్టం చేశారు.
ఒకరకంగా ఈ ప్రకటన బీజేపీ వారికి అనుకూలంగా పరిణమిస్తుంది. బీజేపీ ఎంపీలనో, వేరే పార్టీలకు చెందిన తమ అనుకూల ఎంపీలతోనో సభలో గొడవ చేయిస్తే మొత్తానికి అవిశ్వాసతీర్మానం చర్చకు రాదు. ఎలాగూ బడ్జెట్ ఆమోదం పొందింది కాబట్టి రెండు మూడు రోజులు ఈ తంతు నడిపించి సభను పూర్తిగా వాయిదా వెయ్యొచ్చు అనే ఆలోచనలో ఉందంట ప్రభుత్వం.
మరోవైపు తెలుగుదేశం పెడుతున్న అవిశ్వాసానికి మద్దత్తు పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే తమకు మద్దత్తు ఇచ్చే ఎంపీల సంఖ్య 100 దాటిందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. పదకొండు పార్టీలతో కలిపి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాట్లు తెరవెనుక చేస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.



