2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత కీలకమో దేశ రాజకీయాలకు కూడా అంతే ముఖ్యమైంది. బాబు అరెస్టుతో ఏకమైనా టీడీపీ, జనసేనల బంధానికి బీజేపీ తోడయ్యింది. ఆ తోడే పరోక్షంగా దేశానికి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధాన మంత్రిగా నిలబెట్టింది.
దీనితో ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి డబుల్ ధమాకా కొట్టింది. అయితే అటు ఉత్తర భారతం అంతా మోడీ ‘డబుల్ ఇంజన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకెళితే ఇప్పుడు దక్షిణ భారతంలో కూడా బీజేపీ ఈ డబుల్ ఇంజన్ సర్కార్ దిశగా అడుగులు వేస్తుంది.
Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!
ఇందులో భాగంగా ఏపీలో తొలి అడుగు వేసిన బీజేపీ ఏపీ అభివృద్ధిలో తన డబుల్ ఇంజన్ మార్క్ అభివృద్ధి చూపించినట్లయితే త్వరలో జరగబోయే సౌత్ ఇండియా ఎన్నికలలో బీజేపీ తన బలం పెంచుకునే అవకాశం ఉంటుంది.
అయితే ఈ నెల 8 న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఏపీ పర్యటనలో భాగంగా విశాఖ లోని ఆంధ్రా యూనివర్సిటీ ని సందర్శించనున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏపీలో ఏర్పాటు చేయబడుతున్న గ్రీన్ హైడ్రోజన్ పార్క్, రైల్వే జోన్ పరిపాలన భవనాలు, మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.
Also Read – ‘రంజీ’లతో రాణిస్తారా.?
అయితే నేడు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏపీ స్థానం చాల ప్రత్యేకమైనది కావడంతో రాజధాని అమరావతికి నిధులు, పోలవరం పూర్తి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అంశం మీద ఏపీ ప్రజలకు మోడీ భరోసా ఇవ్వగలిగితే ఇక ఏపీలో కూడా UP మాదిరి డబుల్ ఇంజన్ సర్కార్ షురూ అయినట్టే. మరి ఆదిశగా మోడీ ఏపీ ని పరుగులు పెట్టిస్తారా.?
ఇన్నాళ్లుగా ఏపీ మీద సీత కన్నేసిన కేంద్ర ప్రభుత్వం ఇకనైనా తన ద్రుష్టి మార్చుకుని కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడితే మరో ఐదేళ్లలో ఏపీ రూపురేఖలు మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దల పట్ల వీర విధేయులుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బాబు గ్యారెంటీకి మోడీ షూరిటీ దక్కితే చాలు.
Also Read – ఎఫ్-1 కేసు: సుప్రీంకోర్టు సింపుల్‌గా తేల్చేసింది!