‘ఫేక్’ జాబితాలో మోడీనే నెంబర్ 1!

Narendra Modi Fake Twitter Followersఎన్నికలలో గెలవడానికి ‘ఫేక్’ హామీలు ఇవ్వడం… ఆ తర్వాత వాటిని మరిచిపోవడం రాజకీయ నాయకులు సహజంగా చేసే పనే. ఇలాంటి ‘ఫేక్’ నాయకులకు ఇండియాలో కొదవలేదు. ఆ మాటకొస్తే ప్రపంచం నిండా దాదాపుగా ఇలాంటి నేతలే ఉంటారు. ఎన్నికలకు ముందువరకు చెప్పేదొకటి… అధికారంలోకి రాగానే చేసేదొకటి..! ఇందుకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏం తక్కువ కాదని, ఏపీకి సంబంధించిన అనేక విషయాల్లో ఇప్పటికే నిరూపించుకున్నారు.

ఇలా హామీల విషయంలోనే కాదు, సోషల్ మీడియాలో మోడీని ఫాలో అవుతున్న వారిలో కూడా 60 శాతం మంది ‘ఫేక్’ అని ఒక తాజా విశ్లేషణ చెప్పింది. ఇండియాలో అత్యధిక ట్విట్టర్ ఫాలోయర్స్ తో సొంతం చేసుకున్న మోడీ ఖాతా సంఖ్య 41 మిలియన్స్ కు పైగా చేరుకుంది. అయితే ఇందులో 60 శాతం పైగా ఫేక్ ఫాలోయర్స్ ఉన్నారని స్పష్టం అయ్యింది. ప్రపంచంలోనే ఇలా అత్యధిక శాతం ఫేక్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్న ఘనత మన మోడీకే లభించడం మరో అరుదైన విషయం.

ADVERTISEMENT

ఇదే అంశంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 37 శాతం ఫేక్ ఫాలోయర్స్ ను మాత్రమే కలిగి ఉన్నారు. ఈ జాబితాలో మోడీ తర్వాత స్థానంలో పోప్ ఫ్రాన్స్సిస్ 59 శాతంతో రెండవ స్థానంలో ఉండగా, మెక్సికన్ ప్రెసిడెంట్ నియేటో 47 శాతం, సౌదీ అరేబియా రాజు సల్మాన్ 8 శాతం ఫేక్ ఫాలోయర్స్ ను కలిగి ఉన్నారు. ఫేక్ హామీల విషయంలోనే కాదు, ఫేక్ ఫాలోయర్స్ కూడా ఘనతను సొంతం చేసుకున్న ఖ్యాతి నరేంద్ర మోడీ దక్కించుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.Narendra Modi Fake Twitter Followers

ADVERTISEMENT
Latest Stories