ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసి మూడవ ఫ్రంట్ ప్రయత్నాలలో ఉన్నారు. మరోపక్క తెరాస ఎంపీలు ముస్లీమ్ రేజర్వేషన్ల బిల్లు కోసం పార్లమెంట్ ను స్తంభింప చేస్తున్నారు. ఈ సమయంలో ప్రధాని మోడీ మాత్రం సంధి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది.
కేసీఆర్ కుమార్తె, నిజామాబాదు ఎంపీ కవిత పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆంగ్లంలో కాకుండా తెలుగులో ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం విశేషం. సదరు లేఖను ప్రధానమంత్రి కార్యాలయం.. ఎంపీ కవితకు పంపింది. ఈ లేఖపై ప్రధాని మోదీ సంతకం కూడా చేశారు.
“శ్రీమతి కల్వకుంట్ల కవిత, మీ జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి. దేశ ప్రజలకు మీరు సేవలందించేందుకు వీలుగా కావలసిన ఆరోగ్యకర, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నాను. శుభాభినందనలతో నరేంద్రమోదీ,” అని రాసి ఉంది లేఖలో.



