
బాహుబలి సినిమాతో టాలీవుడ్ సినిమా పరిధి పెరగడంతో ఇక్కడి హీరోస్, దర్శకులకే కాదు హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రెజ్ పెరిగిన మాట వాస్తవం. అయితే ఈ కోవలోనే పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ ఇమేజ్ ను సొంత చేసుకున్న రష్మిక మందన ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా తన హావ కొనసాగిస్తున్నారు.
పుష్ప ది రైజ్, యానిమల్, పుష్ప ది రూల్, తాజాగా ఛావా సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న రష్మిక ఒక అరుదైన రికార్డ్ ను సొంత చేసుకున్నారు. అయితే ఈ సినిమాలన్నీ అటు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినా సందర్భంగా గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే రష్మిక సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 3300 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రచారం జరుగుతుంది.
Also Read – డీలిమిటేషన్: రాజకీయ లెక్కలు సరిచూసుకోవలసిందే!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లిన కథానాయకి లలో ఇంత వరకు ఎవ్వరు ఈ స్థాయి వసూళ్లు సాధించలేదు, అలాగే ఇంతటి ఘన విజయాలను అందుకోలేదు. అయితే అటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా, ఆలియా, జాన్వీ వంటి ముద్దుగుమ్మలకు కూడా సాధ్యం కానీ సినీ వసూళ్లు రష్మిక ఖాతాలోకి వచ్చి పడుతున్నాయి. ఒక్క బాలీవుడ్ లోనే రష్మిక మూవీస్ సుమారు 1850 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సామి సామి…అంటూ అన్ని ఇండస్ట్రీలను చుట్టేస్తున్న రష్మిక తన సొంత రాష్ట్రంలో మాత్రం వరుస వివాదాలను ఎదుర్కొంటు విమర్శల పాలవుతున్నారు. పుష్ప మూవీ తో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిన మందన యానిమల్ మూవీ తో అటు బాలీవుడ్ లోను పాగా వేశారు. ఇక తాజాగా విడుదలైన ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఛావా మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దుమ్ముదులుపుతుంది.
Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?
ఇక ప్రస్తుతం ఈ అమ్మడు సల్మాన్ ‘సికిందర్’, ధనుష్ ‘కుభేర’ మూవీ లతో బిజీగా ఉన్నారు. కుభేర కుగాను టాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా, తమిళ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీ పట్ల కూడా అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.