ఏపీకి అభివృద్ధికి గేట్ వేలు… పోర్టులు, ఎయిర్ పోర్టులు!

New Ports and Airports Set to Boost Andhra Pradesh Growth

తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు సముద్రతీరం లేదు కనుక పోర్టులు కూడా లేవు. కనుక ఈ మూడు రాష్ట్రాలు తప్పనిసరిగా పక్కనే ఉన్న ఏపీ లేదా ఓడిశాలోని పోర్టులను వినియోగించుకోక తప్పదు.

ఇది ఏపీ అభివృద్ధికి చాలా కలిసి వచ్చే అంశమే. తెలంగాణలో హైదరాబాద్‌ని కలుపుతూ ఇప్పటికే మంచి రోడ్డు మార్గం ఉంది.

ADVERTISEMENT

ఏపీలో మచిలీపట్నం పోర్టు, నెల్లూరులో రామయపట్నం పోర్టులను తెలంగాణతో సహా చుట్టుపక్కల రాష్ట్రాలకు కలుపుతూ రోడ్ మార్గాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయి.

శ్రీకాకుళంలో జిల్లాలో మూలపేట పోర్టు నిర్మాణం కొరకు భూసేకరణలో రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో సోంపేట, బారువ వద్ద నిర్మించేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో మూలపేట వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక పోర్టు, ఎయిర్ పోర్టు రెండూ కూడా వస్తే శ్రీకాకుళం జిల్లా రూపురేఖలే మారిపోతాయి.

ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు ఓడిశాలో పారాదీప్, విశాఖ పోర్టుని తమ ఖనిజ ఎగుమతి దిగుమతులకు వినియోగించుకుంటున్నాయి. కనుక మూలపేట పోర్టు సిద్దమైతే అది ఈ రెండు రాష్ట్రాల మరింత దగ్గరగా ఉంటుంది కనుక ఎగుమతి దిగుమతులు మరింత ఊపందుకుంటాయి.

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్ కంపెనీ అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. దీనికి అవసరమైన బొగ్గు, ఇతర ముడి ఖనిజాలు దిగుమతి చేసుకునేందుకు, అలాగే ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే ఉక్కుని విదేశాలకు ఎగుమతి చేసేందుకు నక్కపల్లికి సమీపంలోనే రూ.70 వేల కోట్లతో ఆ కంపెనీయే ఓ ప్రైవేట్ పోర్టు నిర్మించబోతోంది. కనుక ఇక్కడి నుంచి కూడా భారీగా ఎగుమతులు దిగుమతులు జరుగబోతున్నాయి.

విశాఖకు సమీపంలో విజయనగరం-శ్రీకాకుళం జిల్లాలకు మద్య భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే.

కనుక ఏపీలో కొత్తగా నిర్మితమవుతున్న ఈ పోర్టులు, ఎయిర్ పోర్టులు రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో కొత్త ఊపు తీసుకు రావడం, వాటి ద్వారా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిలో గణనీయమైన మార్పు రావడం ఖాయమే.

ADVERTISEMENT
Latest Stories