‘కింగ్’ నాగార్జున హీరోగా తాను నిర్మిస్తున్న చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ప్రముఖ నటి టబు కూడా నటిస్తున్నారంటూ వచ్చిన వార్తలను దర్శకుడు రాంగోపాల్ వర్మ ఖండించాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ… ఈ వార్త పచ్చి అబద్ధమని… వారిద్దరూ ఈ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశాడు.
ADVERTISEMENT
కాగా, తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ‘శివ’ కాంబినేషన్, మరోసారి అటువంటి విజయాన్నే సాధించేలా పక్కా స్క్రిప్టుతో సిద్ధమై త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇతర నటీనటులను ఎంపిక చేయాల్సి వుండగా, నెట్టింట రోజుకో వార్త పుట్టుకొస్తోంది.
ADVERTISEMENT



