ఏమిటో ఈ బాబు… ఒక్క చెట్టు నరికించడు!

No Trees Cut Chandrababu Naidu

ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారంటే ఎలా ఉండాలి?నాలుగు రోజులు ముందుగానే ఆ ప్రాంతంలో స్కూలు బస్సులన్నీ జనసమీకరణకు బుక్ చేసేయాలి. ఆరోజు ఆ చుట్టుపక్కల స్కూళ్ళు, కాలేజీలు, దుకాణాలు మూయించేయాలి.

దారి పొడవునా తోరణాలు.. కాదు కాదు… పరదాలు కట్టించాలి. రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించాలి… సారీ అలవాటులో పొరపాటు…. చెట్లు నరికించేయాలి… జనానికి ‘థాంక్యూ సిఎం సార్’ అంటూ ప్లకార్డులు తయారు చేయించి చేతిలో పెట్టాలి.

ADVERTISEMENT

సంక్షేమ పధకాల లబ్దిదారుల జాబితాలు బయటకు తీసి అందరూ తప్పనిసరిగా సభకు రావాలని మెసేజులు పంపాలి. రాకపోతే పధకాలు కట్ అని హెచ్చరిస్తుండాలి.. అయినా కూడా అందరూ రాకపోవచ్చు. కనుక ఆ రోజు సిఎం సభ ముగిసే వరకు ఊళ్ళో కరెంటు, నీళ్ళు నిలిపివేయాలి. ఇన్ని చేసినా అందరూ వచ్చారో లేదో చూసుకొని మళ్ళీ అటెండెన్స్ వేసుకోవాలి.

పక్క వీదికైనా సరే సిఎం గారు హెలికాఫ్టర్‌లోనే వెళ్ళాలి… సభలో సిఎంగారు తన గొప్పదనం వివరిస్తుండగా సభకు వచ్చినవారు ఎవరూ మద్యలో గేట్లు, గోడలు దూకి పారిపోకుండా కాసుకుంటూ ఉండాలి. ముఖ్యమంత్రి పర్యటన అంటే ఇన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంతమంది సమన్వయం చేసుకొని పనిచేయాలి.

కానీ ఈ చంద్రబాబు నాయుడుకి ఇదేమీ పట్టదు. ఏ హడావుడీ లేకుండా ఒక్కరే ఏ బస్సో, ఆటో రిక్షా ఎక్కేసి హటాత్తుగా ఊర్లోకి వచ్చేస్తుంటారు. ముఖ్యమంత్రినని మరిచినట్లు గ్రామస్తుల ఇళ్ళలోకి వెళ్ళిపోతారు… మరో ఆలోచన లేకుండా వాళ్ళు ఇచ్చిన టీ కాఫీలు తాగేస్తుంటారు.

ముఖ్యమంత్రి వద్దకు జనం కాదు… ఆయనే జనం వద్దకు వెళ్ళిపోయి వారితో పాటు పొలం గట్ల వద్ద నేలపై కూర్చొని ముచ్చట్లు పెడతారు. గ్రామస్తుల ఇళ్ళకి వెళ్ళి స్వయంగా పించన్లు, సంక్షేమ పధకాల సొమ్ము అందించి కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటారు.

పదవీ, అధికారం లేని జగన్మోహన్ రెడ్డి నాకు భద్రత సరిపోవడం లేదు. జెడ్ ప్లస్ భద్రత కల్పించడం లేదు. నా ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని గోల గోల చేస్తుంటారు.

కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం జడ్డూ లేదు… ప్లస్సూ లేదూ… అంటూ జనం మధ్యకు వెళ్ళిపోతూనే ఉన్నారు. కనీసం ఒక్క పరదా కట్టించకుండా, ఒక చెట్టు కొట్టించకుండా, హెలికాఫ్టర్‌ పక్కన పడేసి ఆటో రిక్షాలో తిరిగేస్తుంటే, ముఖ్యమంత్రి హోదా తగ్గిపోదా? అంటూ కొందరు సన్నాయినొక్కులు నొక్కుతూనే ఉన్నారు.

కానీ బాబుకి ఇవేమీ పట్టవు. లేడికి లేచిందే పరుగు అన్నట్లు మొదటి వారం వచ్చిందంటే చాలు… జనంలోకి వెళ్ళిపోవలసిందే!

ముఖ్యమంత్రి అంటే ఓ బ్రహ్మపదార్ధం అనుకునే ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చంద్రబాబు నాయుడు తమ ఊరికి వచ్చి తమ పక్కనే కూర్చొని మాట్లాడుతుంటే సంతోషంతో పొంగిపోతున్నారు. ముఖ్యమంత్రికే నేరుగా తమ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు.

ఏమిటో ఈ బాబు… అమెరికా వెళ్ళి బిల్ క్లింటన్‌తో భేటీ అవుతారు. డిల్లీ వెళ్ళి ప్రధాని మోడీతో భేటీ అవుతారు. ఊళ్ళో జనంతోనూ కూర్చొని కబుర్లు చెపుతారు. క్వాంటమ్‌ వ్యాలీ, డ్రోన్ టెక్నాలజీ అంటారు.. ఏవమ్మా నాట్లు వేస్తున్నారా? అంటూ పొలంలో రైతు కూలీలని అప్యాయంగా పలకరిస్తుంటారు. చాలా తికమక పెట్టేస్తున్నారు. ఈయనని ఎలా అర్ధం చేసుకోవాలబ్బా!

ADVERTISEMENT
Latest Stories