నిన్న తమిళనాట రికార్డులు సృష్టించిన విజయ్ కి తెలుగు నుండి మంచి సపోర్ట్ లభించింది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మొదలుకొని అందరూ ట్వీట్ల రూపంలో తమ శుభాకాంక్షలు అందించారు. ఇక తెలుగు యువత సోషల్ మీడియాలో విజయ్ కి ఇచ్చిన ఎలివేషన్ మాములుగా లేదు.
అయితే.. ఇంత హడావుడి నడుమ తెలుగు యువతను ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే.. విజయ్ అఖండ విజయానికి ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ ట్వీట్ చేయకపోవడమే. వాళ్ల ట్వీట్ వాళ్ల ఇష్టమే అయినప్పటికీ.. తమ తోటి నటుడు ఈస్థాయి ఘన విజయం అందుకున్నప్పుడు శుభాకాంక్షలు తెలియజేయాల్సిన కనీస బాధ్యత వెళ్లిద్దరి మీదా ఉంది.
అల్లు అర్జున్ తదుపరి సినిమా సన్ నెట్వర్క్ బ్యానర్ లోనే నడుస్తుంది. “రాకా” నిర్మాతలు వాళ్లే. అందువల్ల ఏమైనా సైలెంట్ గా ఉన్నాడా అనుకుంటే.. “రాకా” దర్శకుడు అట్లీ విజయ్ పార్టీ స్టార్ట్ చేసినప్పటినుండి వరుసబెట్టి ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెడుతూనే ఉన్నాడు. డైరెక్టర్ కి లేని టెన్షన్ యాక్టర్ కి ఎందుకు.
ఇక ఎన్టీఆర్ సైలెన్స్ ఏమిటి అనేది కూడా అర్థం కాలేదు. ఎందుకంటే.. రాజకీయంగా లింక్ ఉన్న అతికొద్ది కథానాయకుల్లో ఎన్టీఆర్ ఒకడు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు సంతోషంగా శుభాకాంక్షలు తెలిపాడు ఎన్టీఆర్.
మరి ముద్దుగా బావ-బావ అని పిలుచుకునే ఈ ఇద్దరు స్టార్ హీరోలు పాటిస్తున్న ఈ స్ట్రాటజిక్ సైలెన్స్ వెనుక కారణం ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.




