నాగోల్ నుండి మెట్టుగూడ వరకు ఉన్న మొదటి ఫేస్ హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు తొందర్లో మొదటి నెల పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటికే వారాంతాలలో రోజుకు లక్ష మంది ప్రయాణికులు మెట్రోను వాడుతున్నారు. అయితే మరోవైపు పాతబస్తీకి కూడా దీనిని విస్తరించాలని డిమాండ్లు వస్తున్నాయి.
అయితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని సమాచారం. పాత బస్తీలో మెట్రో రైలును మజిలిస్ పార్టీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దానికితోడు ఇక్కడ 6 కిలోమీటర్ల దూరానికే 2000 కోట్లు ఖర్చు అవ్వడంతో గవర్నమెంట్ వెనుకడుగు వేస్తుంది. ముందు అనుకున్న ప్లాన్ లో ఇది భాగమే అయినప్పటికీ ప్రాజెక్టు ఆలస్యం అవ్వడంతో అదనపు నిధులు ఇస్తేగాని ముందుకు కదలని పరిస్థితి.
దీనితో మొత్తానికి ప్రతిపాదన పక్కన పెట్టేస్తే ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఆపరేషన్స్ ప్రారంభించిన మార్గం లాభాలు పట్టడానికి కనీసం 7 సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. దీనితో ఇప్పటికే ప్రారంభించిన పనులు పూర్తి చేసి ఎల్ అండ్ టీ తప్పుకోనుంది. కొత్త మార్గాలకు మళ్ళి టెండర్లు పిలవాల్సిందే.



