పాకిస్తాన్‌కి ఇలాంటి హెచ్చరికలు… సబబేనా?

Indian Army Chief Upendra Dwivedi warning Pakistan amid Operation Sindoor 2.0 and rising India-Pakistan tensions

ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా పాకిస్తాన్‌ బుద్ధి మారలేదని గత ఏడాది ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ప్రేలుళ్ళు నిరూపించాయి. అప్పుడే భారత్‌ మళ్ళీ ఆపరేషన్ సిందూర్ 2.0 చేపడుతుందని అందరూ భావించారు కానీ సంయమనం పాటించింది. కానీ నేటికీ పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు భారత్‌లో కుట్రలు చేస్తూనే ఉన్నారు. అవకాశం చిక్కితే మళ్ళీ భారీ ప్రేలుళ్ళు జరిపేందుకు కుట్రలు చేస్తూనే ఉన్నారని భారత్‌ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర దివ్వేది అన్నారు.

శనివారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నప్పుడు అయన పాకిస్తాన్‌ని చాలా తీవ్రంగా హెచ్చరించారు. “మా సహనానికి కూడా హద్దు ఉంటుంది. ఇకనైనా పాకిస్తాన్‌ భారత్‌ వ్యతిరేక ఉగ్రవాదాన్ని ఆపకుంటే ప్రపంచపఠం నుంచి పాకిస్తాన్‌ మాయం కావడం తధ్యం,” అని హెచ్చరించారు.

ADVERTISEMENT

దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాడు పాకిస్తాన్‌కి వెళ్ళి స్నేహ హస్తం అందించినా వెంటనే దాని వక్రబుద్ధి ప్రదర్శిస్తే ‘కార్గిల్ యుద్ధం’ జరిగింది. ఆ తర్వాత ప్రధాని మోడీ కూడా పాక్‌ వెళ్ళి స్నేహహస్తం అందిస్తే మళ్ళీ భారత్‌పై దాడులు చేసింది.

కనుక పాక్‌ పాలకులకు, సైన్యాధ్యక్షులకు అర్ధమయ్యేలా ఒకసారి సర్జికల్ స్ట్రైక్ చేశారు. కానీ పాక్‌ వక్ర బుద్ధి మారలేదు. కనుక ఈసారి ‘ఆపరేషన్ సింధూర్’ చేశారు. అయినా పాక్‌ వక్రబుద్ధి మారలేదు.

కనుక భారత్‌ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర దివ్వేది చెప్పినట్లు భారత్‌ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అది నశించినాడు భారత్‌ మళ్ళీ ఆపరేషన్ సిందూర్ 2.0 చేపడితే నష్టపోయేది పాకిస్తానే.

మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం అలవాటున్న పాక్‌ భారత్‌ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర దివ్వేది హెచ్చరికను తేలికగానే తీసుకోవచ్చు. అణుబాంబులతో భారత్‌ని కూడా ప్రపంచ పఠం నుంచి తుడిచి పెట్టేస్తామని ప్రగల్భాలు పలుకవచ్చు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కూడా ఇరాన్‌ని ప్రపంచ పఠం నుంచి తుడిచి పెట్టేస్తానన్నప్పుడు ప్రపంచదేశాలు తప్పు పట్టాయి. భారత్‌ కూడా ఆవిధంగా మాట్లాడటం సబబు కాదు కదా?

ముఖ్యంగా ఆర్మీ అధినేతలు ఈ స్థాయిలో కవ్వించుకుంటుంటే ఇరు దేశాల మద్య ఉద్రిక్తతలు పెరిగి ఏదో రోజున నిజంగానే యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక వారు కూడా సంయమనం పాటించడం చాలా అవసరమే.

ADVERTISEMENT
Latest Stories