మొబైల్ ఉత్పత్తి ప్లాంట్లకు నిలయంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ లోకి మరో మొబైల్ సంస్థ ఎంటర్ అయ్యింది. చైనా కేంద్రంగా స్మార్ట్ మొబైల్ రంగంలో దూసుకుపోతున్న ‘అప్పో’ సంస్థ తన మొబైల్ తయారీ ప్లాంట్ ను నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. చైనాలో పర్యటన గావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం సంస్థ ప్రతినిధులతో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలను అందించాయి.
ఉన్నతాధికారులతో భేటీ అయిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ లో హార్డ్ వేర్ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను మరియు ప్రపంచ వ్యాప్తంగా వాటికి ఉన్న డిమాండ్ ను వివరించి.., అందుకు అనుగుణంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరిన మీదట దాదాపు 1000 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు సంసిద్ధత వ్యక్త చేసారు ‘అప్పో’ ప్రతినిధులు. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా దాదాపు 25 వేల మందికి ఉపాధి కల్పిస్తామని కూడా సంస్థ ప్రతినిధులు స్పష్టం చేసారు. పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు బృందం చైనాలో బిజీబిజీగా గడుపుతోంది.



