మా నెక్స్ట్ టార్గెట్ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌: రాజ్‌నాధ్ సింగ్‌

Our next target is Pakistan-occupied Kashmir: Rajnath Singh

భారత్‌-పాక్‌ దాదాపు ప్రత్యక్ష యుద్ధం వరకు వెళ్ళి చివరి నిమిషంలో వెనక్కు తగ్గాయి లేకుంటే ఈపాటికి ఇరుదేశాలలో పెను విధ్వంసం జరిగి ఉండేది. అయితే నేటికీ పాక్‌ బుద్ది మారలేదు. కనుక ఏదో రోజు మళ్ళీ పాక్‌పై భారత్‌ దాడులు చేయడం ఖాయమే.

ఈ నేపధ్యంలో రాజ్‌నాధ్ సింగ్‌ నేడు చేసిన వ్యాఖ్యలు బహుశః పాక్‌లో ప్రకంపనలు పుట్టిస్తుండవచ్చు. ఆయనేమన్నారంటే, “పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నవారు మన కుటుంబ సభ్యులే. ఎప్పటికైనా భారత్‌లో కలిసిపోవాలని వారు కోరుకుంటున్నారు.

ADVERTISEMENT

ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌ మరింత బలపడింది. కనుక ఉగ్రవాద దేశంగా మిగిలిన పాక్‌తో ఉండటం కంటే అత్యంత శక్తివంతమైన భారత్‌లో కలిసి ఉండటమే మంచిదని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలు భావిస్తున్నారు. కనుక బహుశః త్వరలోనే ఏదో రోజు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో విలీనం అవడం ఖాయం.

మా నెక్స్ట్ టార్గెట్ కూడా అదే! కనుక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో విలీనం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు,” అని రాజ్‌నాధ్ సింగ్‌ అన్నారు.

ఈసారి ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధ చర్యగా పరిగణించి చాలా తీవ్రస్థాయిలో పాక్‌పై దాడులు చేస్తామని ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ హెచ్చరించారు.

భారత్‌ క్షిపణి దాడుల తర్వాత పాక్‌ పూర్తిగా చల్లబడిపోయినప్పటికీ, నేటికీ పాక్‌ ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్‌లో కనిపిస్తూనే ఉన్నారు. వారిని నియంత్రించే పరిస్థితిలో పాక్‌ లేదు కనుక ఏదో రోజు మళ్ళీ వారు దాడులు చేయడం ఖాయమే. అప్పుడు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ని భారత్‌ స్వాధీనం చేసుకోవడం ఖాయమే.

కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ జమ్ము కశ్మీర్‌ని భారత్‌ నుంచి విడదీయాలని నాలుగు దశాబ్ధాలుగా పాక్‌ ప్రయత్నిస్తోంది. కానీ భారత్‌ అటువంటి కుట్రలు, కుతంత్రాలు చేయకుండా పాక్‌తో యుద్ధం చేసి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది.

భారత్‌ జమ్ము కశ్మీర్‌ని కాపాడుకొని అభివృద్ధి చేసుకుంటుంటే, పాక్‌ అధీనంలో ఉన్న కశ్మీర్‌ ముక్కని ఉగ్రవాదుల అడ్డాగా మార్చేసింది. కనుక ఆ ముక్క కూడా భారత్‌లో విలీనం అయితే అది కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది.

ADVERTISEMENT
Latest Stories