Chandrababu Naidu P4 Program

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పేదల అభ్యున్నతికి రకరకాల కార్యక్రమాలు, సంక్షేమ పధకాలు అమలుచేస్తూనే ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయినా నేటికీ దేశంలో 50 శాతం పైగా బీదరికంలోనే ఉన్నారు.

సరైన ఆలోచన, సమగ్రమైన ప్రణాళిక, దానిని అంతే సమర్ధంగా ఆచరించలేకపోవడం వల్లనే నేటికీ దేశంలో బీదరికం ఉంది. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం సంక్షేమ పధకాలు అమలుచేస్తూనే ఉన్నాయి.

Also Read – పాపం రాజాసింగ్.. రాజీనామాతో రాజకీయ అనాధగా మారారు!

ఏపీలో కూడా సంక్షేమ పధకాలు అమలవుతూనే ఉన్నాయి. కానీ పేదలకు డబ్బు పంచితే బీదరికం తీరదని, వారిని బీదరికంలో నుంచి బయటకు లాగేందుకు మరింత లోతైన ఆలోచన, విస్తృతమైన ప్రణాళిక, కార్యాచరణ అవసరమని భావించిన సిఎం చంద్రబాబు నాయుడు దీని కోసం ‘పీ-4’ అనే సరికొత్త ఆలోచనని ప్రకటించి కార్యరూపం ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాగే ఎవరికీ అర్ధం కాని మాటలు, ఆలోచనలు చేస్తుంటారని చాలా మంది అనుకోవచ్చు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు “ఏ ఇజం ఉండదు కేవలం టూరిజం మాత్రమే ఉంటుందని” అంటే తాము చాలా కోపగించుకున్నారని, కానీ 30 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు ఆయన మాటలను అర్ధం చేసుకున్నామని వామపక్ష నేతలు చెప్పారు.

Also Read – పేర్ని లీక్స్…చాల వైలెంట్ గురు

అదే విదంగా డ్వాక్రా సంఘాలు, రైతు బజారులు, ఐటి కంపెనీలు, ఇంజనీరింగ్ కాలేజీలని సిఎం చంద్రబాబు నాయుడు పరిచయం చేస్తున్నప్పుడు ఇలాగే విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు వాటి ఫలాలు అందరూ అనుభవిస్తున్నారు.

అదే విదంగా సిఎం చంద్రబాబు నాయుడు చెపుతున్న ఈ ‘పీ4’ గురించి అర్ధం చేసుకోలేనివారు ఇప్పుడు ఆయనని విమర్శిస్తున్నారు. కానీ ఇది విజయవంతమై రాష్ట్రంలో బీదరికం తగ్గినప్పుడు అందరూ మళ్ళీ చంద్రబాబు నాయుడు దూరదృష్టి గురించి తప్పక మాట్లాడుకుంటారు.

Also Read – తెలంగాణలో గోదావరి నీళ్ళని వాడుకోలేరు కానీ..

ఇంతకీ ఈ ‘పీ-4’ ఏమిటి?అంటే క్లుప్తంగా చెప్పుకోవాలంటే, సమాజంలో ధనవంతులు నిరుపేదలను దత్తత తీసుకొని సాయపడటమే. అయితే దత్తత అంటే వారికి డబ్బు ఇవ్వడం లేదా చదువులు, ఉద్యోగాలు, ఉపాధికి సాయం చేయడం మాత్రమే కాదు. ఆవిదంగా చేస్తే సంక్షేమ పధకాలకు దీనికీ తేడా ఏమీ ఉండదు కనుక ఆశించిన ఫలితం కూడా రాదు.

పీ4లో కీలకమైన విషయం ఏమిటంటే ధనికులు, నిరుపేదలకు మద్య ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు వారధిగా ఉంటారు. అంతేకాదు.. వారు కూడా దీనిలో భాగస్వాములుగా మారి పేదలను ఆదుకోవచ్చు.

సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న సచివాలయంలో ‘స్వర్ణాంధ్ర పి-4 ఫౌండేషన్’ తొలి సమావేశం జరిగింది. ఈ విధానంలో దత్తత తీసుకున్న కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’గా పేర్కొంటోంది ప్రభుత్వం. ఆగస్ట్ 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల బంగారు కుటుంబాలను, వారికి విద్య, ఉద్యోగం, ఉపాధి, శిక్షణలలో మార్గదర్శనం చేసేందుకు ఒక్కో కుటుంబానికి ఒకరు చొప్పున 15 లక్షల మంది మార్గదర్శులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ ‘పీ4’లో పేద కుటుంబాలను గుర్తించడంతో పాటు వారికి సాయపడగల ధన్యవంతులను కూడా గుర్తించి, ఇరు వర్గాలను అనుసంధానం చేసి, దీనిని కార్యాచరణగా మార్చేందుకు రాష్ట్ర స్థాయి నుంచి జిలా, నియోజకవర్గం స్థాయి వరకు పీ-4 కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

పీ-4కి ఎంపిక చేసిన బంగారు కుటుంబాలకు యధావిధిగా సంక్షేమ పధకాలన్నీ ఇస్తామని వాటిలో ఎటువంటి కొత విధించమని సిఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.