Padi Kaushik Reddy for the Party ? For the Name?

తెలంగాణ ఎన్నికల ప్రచారం నాటి నుంచి ఒక పేరు తెలంగాణ రాజకీయాలలో చాల ఫేమస్ అయ్యింది. మీరు నాకు ఓటేసి గెలిపించక పోతే నేను చచ్చిపోతా అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గత కొద్దీ రోజుల నుంచి ఎదో ఒక వివాదంలో నిలుస్తూ నిత్యం వార్తలలో ఉంటున్నారు.

Also Read – వైసీపీ డీఎన్ఏలోనే ఏదో లోపం… ఉందా?

కరీంనగర్ కలక్టరేట్ లో సమీక్షలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన కరీంనగర్ పీఎస్ లో కౌశిక్ పై కేసు నమోదు చేసారు. దీనితో కౌశిక్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన పై మూడు కేసులు నమోదు చేసారు.

ఇక కౌశిక్ ను అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేసి జైలుకి పంపించడం, అక్కడి నుండి న్యాయస్థానం కౌశిక్ రెడ్డి కి బైలు మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ముఖ్య నేతలు హరీష్ రావు, కేటీఆర్ కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందంటూ కౌశిక్ అరెస్టు ని ఖండించారు.

Also Read – కేసీఆర్‌ రీరిలీజ్‌ కోసం ఉప ఎన్నికలు నిర్వహించాలా?

గతంలో కూడా ఇదే మాదిరి ఈ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసుల హడావుడి, పార్టీ క్యాడర్ ఆహాకారాలు, పార్టీ నాయకుల నినాదాల మధ్య హైడ్రామా నడిచింది. కౌశిక్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వ పెద్దలను రెచ్చకొట్టి, తద్వారా ప్రభుత్వం తన పై తీసుకుంటున్న చర్యలతో ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా.?

ఈ రకమైన ప్రచారంతో నిత్యం వార్తలలో ఉంటూ రాజకీయంగా తన ప్రభావాన్ని పార్టీలో మరింత బలంగా చూపాలని కౌశిక్ భావిస్తున్నారా.? బిఆర్ఎస్ ఓటమితో ఆ పార్టీ అధినేత కేసీఆర్ మౌన ముద్రలోకి వెళ్లగా ఇక మిగిలిన సీనియర్ నాయకులు పార్టీ జెండా మార్చుకుని కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. దీనితో బిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు, కేటీఆర్ పేర్లు తప్ప తెలంగాణ రాజకీయాలలో బిఆర్ఎస్ తరుపున మరో పేరు వినిపించడం లేదు.

Also Read – చిరంజీవి…ఎందుకీ అసందర్భాలు.?

కానీ ఇప్పుడు వీరిద్దరికి తోడు కౌశిక్ రెడ్డి పేరు కూడా నిత్యం వార్తలలో ఉండడంతో తెలంగాణ రాజకీయ వేదికల మీద కౌశిక్ పేరు కూడా వినిపిస్తుంది, కనిపిస్తుంది, చర్చకొస్తుంది. అయితే ఈయన ఇంతలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద దూకుడు ప్రదర్శించడం వెనుక వ్యూహం ‘వ్యక్తిగత పేరు’ కోసమా.? లేక ‘పార్టీ ప్రతిష్ట’ కోసమా.? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.




ఇదిలా ఉంటే అసలు ఈయన ఇంతలా ప్రజలలో, మీడియాలో ప్రచారం అవ్వడానికి ఒకరకంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమనే వారు కూడా లేకపోలేదు. మరి కాంగ్రెస్ సర్కార్ కౌశిక్ రెడ్డిని మరో రేవంత్ రెడ్డి గా మార్చబోతుందా.? అనేది చూడాలి.