పాకిస్తాన్ ‘కన్ను’ ఏపీపై పడిందేంటి?

Amaravati Capital Latest designsనవ్యాంధ్రలోని గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో అమరావతి పేరిట నూతన రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వెలగపూడి పరిధిలో తాత్కాలిక రాజధానిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్న నేపధ్యంలో, ఈ నెల 27 లోగా తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి కావాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. ఇక సచివాలయానికి ఉద్యోగులు వచ్చి వెళ్లేందుకు రహదారులు కూడా ఏర్పాటవుతున్నాయి. వెరసి ఓ రాష్ట్ర పాలనకు సంబంధించిన కేంద్రం అక్కడ రూపుదిద్దుకుంటోంది.

ADVERTISEMENT

అయితే ఈ పనులపై పాక్ మీడియా ఓ వింత కథనాన్ని ప్రసారం చేసింది. ఈ నెల 3న పాక్ కు చెందిన ఓ టీవీ ఛానెల్ లో జరిగిన చర్చా గోష్టి సందర్భంగా ఆ దేశానికి చెందిన ఓ పెద్ద మనిషి అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం జరుగుతోందని, అక్కడ అమెరికాపై ప్రయోగించేందుకు హైడ్రోజన్ బాంబులను ఏపీ ప్రభుత్వం తయారు చేస్తోందని ఆ పెద్ద మనిషి తేల్చేశారు.

అమరావతి డిజైన్ లోని ఓ చిమ్ని లాంటి నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ గత నెలలోనూ ఆ దేశ మీడియాలో ఆసక్తికర కథనాలు ప్రసారమయ్యాయి. ఇక మీడియాకు వంత పాడిన పాక్ ప్రభుత్వం కూడా ముందూ వెనుకా చూసుకోకుండా అమరావతిలో నిర్మిస్తున్న న్యూక్లియర్ సిటీ నిర్మాణంపై నిశిత పరిశీలన చేస్తున్నట్లు ప్రకటించింది. అసలే అతలాకుతలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పై పాకిస్తాన్ కన్ను ఎలా పడింది? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories