పాక్ పాలకులకు ఆ బాధ ఇప్పుడు అర్దమవుతుందా?

Pakistani Rulers Will Understand The Pain Now

భారత్‌కు కశ్మీర్ కుంపటి ఎలాగో, పాకిస్థాన్‌కు బలూచిస్తాన్ కుంపటి అటువంటిది. భారత్‌ నుంచి కశ్మీర్‌ని వేరు చేయాలని జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ప్రవేశపెట్టి మూడు దశాబ్ధాలుగా భారత్‌కి పక్కలో బల్లెంలా మార్చేసింది.

 వేర్పాటువాదులు కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టిస్తుంటే, పాక్ ప్రేరిత ఉగ్రవాదులు కశ్మీర్‌తో సహా భారత్‌లో బాంబు దాడులు చేస్తూ మారణహోమం చేస్తూనే ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఇందుకు తాజా నిదర్శనం కాగా దానికి పాక్ భారీగా మూల్యం చెల్లించింది.

భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి విధ్వంసం సృష్టించాలనుకున్న పాకిస్థాన్‌కు, బలూచిస్తాన్ వేర్పాటువాదులు కూడా సరిగ్గా అదేవిదంగా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు!

నాడు పాక్ ఉగ్రవాదులు భారత్‌ సైనికుల శిబిరాలపై, వారు వెళుతున్న వాహనాలపై మెరుపు దాడులు చేసి వందలమందిని పొట్టన పెట్టుకున్నారు.

ఇప్పుడు బలూచ్‌ లిబరేషన్ ఆర్మీ కూడా పాక్ సైనికులను తరలిస్తున్న బస్సుపై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 27 మంది సైనికులు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 286 దాడులు చేసి 700 మంది పాక్ సైనికులను హతమార్చింది.

పాక్ నుంచి బలూచిస్తాన్‌ వేర్పడి వేరే దేశంగా అవతరించేవరకు ఈ మారణకాండ సాగుతూనే ఉంటుందని బలూచ్ తిరుగుబాటు దారులు హెచ్చరిస్తున్నారు. కనుక ఈ మారణ కాండ ఇక్కడితో ఆగేది కాదని స్పష్టమవుతోంది.

కనుక పాక్ వేర్పాటువాదం, ఉగ్రవాదం వలన భారత్‌ ఎంతగా నష్టపోయిందో, ఏవిదంగా బాధ పడిందో ఇప్పటికైనా పాకిస్థాన్‌ పాలకులకు అర్ధమైతే మంచిది.

ADVERTISEMENT
Latest Stories