ఈమధ్య ఆల్మోస్ట్ అన్నీ సినిమాలకి ఇండియన్ ప్రీమియర్ షోస్ పడిన పావు గంటకి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంటూ పొలోమని కొన్ని సోషల్ మీడియా పేజీల్లో మినీ రివ్యూలు పోస్ట్ అయిపోతున్నాయి. కొత్తలో కాస్త కాస్ఫ్యూజన్ ఉండేది కానీ, తర్వాత జనాలకి క్లారిటీ వచ్చేసింది అవి పెయిడ్ క్యాంపైన్ పోస్టులు అని.
ఇప్పుడు ఆ పోస్టులకి ఒక వెల్యూ లేకుండాపోయినా కూడా నిర్మాతలు వాటిని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అందుకు రీసెంట్ ఎగ్జాంపుల్ “పళ్లి చట్టంబి”. ఈ మలయాళ సినిమాని కేరళ ప్రేక్షకులే మొదటి షోకి రిజెక్ట్ చేసి పక్కన పెట్టారు. కానీ.. తెలుగులో మాత్రం ఇదో అద్భుతం అంటూ పెట్టిన పోస్టులు చూసి చాలామంది నవ్వుకున్నారు.
చివరికి బాక్సాఫీస్ కలెక్షన్స్ దగ్గర ఆ పెయిడ్ మినీ రివ్యూలన్నీ తేలిపోయాయి. చాలామంది కనీసం సినిమా చూడకుండా, డిజిటల్ టీమ్ ఇచ్చిన పోస్టు కాపీలను పెట్టేశారని కూడా తెలిసింది. తమ సినిమా హిట్ చేసుకోవడం కోసం నిర్మాతలు ఎలాంటి పబ్లిసిటీ అయినా చేసుకోవచ్చు కానీ.. కంటెంట్ విషయంలో ఇలా మిధ్యలో ఉండిపోయి, తమని తాము మోసం చేసుకోవడం తప్ప సినిమాకి, సినిమాలో నటించిన హీరోకి ఎలాంటి మంచి చేయడం లేదు అని గ్రహించాలి.
“జనగణమన” లాంటి వండర్ ఫుల్ సినిమా తీసిన డిజో నుండి ఈ స్థాయి సినిమా అనేది ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. కథలో కంటెంట్ లేదు, కథనంలో ఆసక్తి లేదు. పాపం కేరళ దాకా వెళ్లిన తెలుగు నిర్మాతలకు ఓటీటీ & డిజిటల్ పరంగా కాస్త డబ్బులు వచ్చినా.. నిర్మాతలుగా మాత్రం మొదటి చిత్రంలో సి క్యూబ్ బ్రదర్స్ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.




