Parvatipuram TDP Badhude Badhudu programవిజయనగరం జిల్లాలో మంగళవారం పలు గ్రామాలలో సీనియర్ నేతల అధ్వర్యంలో పెద్ద ఎత్తున బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురంలో పతివాడ నారాయణ స్వామి నాయుడు, కంది చంద్రశేఖర్ రావు, బంగార్రాజుల నేతృత్వంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎస్‌ కోట రూరల్ పరిధిలో పెదఖండేపల్లిలో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి అధ్వర్యంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఓ పక్క ఇష్టారీతిన అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి మరోవైపు అన్నిటి ధరలు, ఛార్జీలు పెంచేస్తూ ప్రజల రక్తాన్ని జలగలా పేల్చేస్తున్నాడని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం పరిస్థితి శ్రీలంకలా తయారవుతుందని అప్పుడు ఏపీలో ప్రజలు యూపీ, బీహార్ వలస కార్మికుల్లా ఇతర రాష్ట్రాలకు వలసలు పోవలసి వస్తుందని అన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించి ప్రజలు తమను తాము కాపాడుకోవలసి ఉంటుందని మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి అన్నారు.