కంగారులు కంగారు పెడుతున్నారు..!

Pat Cummins Josh Hazlewood Fitness IPL 2026

19 వ ఐపీల్ సీజన్ 2026 కు ఇంకా 9 రోజుల మాత్రమే మిగిలి ఉండటంతో అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఐపీఎల్ మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, రెండు జట్ల అభిమానులు మాత్రం కంగారుల ఫిట్నెస్ విషయమై కంగారు పడుతున్నారు.

మొదటిగా సన్-రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా ఉన్న ఆస్ట్రేలియన్ ఆటగాడు పాట్ కమిన్స్, ఇప్పటికే అనేక ఐసీసీ టోర్నీలకు ఫిట్నెస్ కారణంగా దూరమవ్వక తప్పలేదు. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన టి-20 వరల్డ్ కప్ లో కమిన్స్ లేని లోటు ఆసీస్ కు స్పష్టంగా తెలిసిపోయింది.

ADVERTISEMENT

అలాగే గతేడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ కు కూడా కమిన్స్ అందుబాటులో లేకపోవటం గమనార్హం. ఇలా, అనేక భారీ ఈవెంట్లను కమిన్స్ తరచుగా మిస్ అవటంతో అతని ఫిట్నెస్ పై అనేక ట్రోల్స్ మరియు ఫ్యాన్స్ నుండి అనేకానేక అనుమానాలు వెలువడుతున్నాయి.

అలాగే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కు చెందిన జోష్ హేజల్వుడ్ కూడా ఐపీఎల్ కు తొలి మ్యాచ్ నుండే అందుబాటులో ఉండబోవట్లేదని ఇప్పటికే అనేక మీడియా సంస్థలు క్లారిటీ ఇవ్వగా, ఇంకా అఫిషియల్ గా ఆస్ట్రేలియా బోర్డు వారు ఎన్.ఓ.సి ఇవ్వకపోవటంతో అభిమానులు కలవర పడుతున్నారు.

ఆర్.సి.బీ జట్టుకు ఎప్పటి నుండో బౌలింగ్ ఒక అతి పెద్ద సమస్యగా ఉండేది. కానీ హేజల్వుడ్ ఆ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆర్.సి.బీ బౌలింగ్ కు వెన్నుముకగా నిలిచాడు అతడు. దీనితో ఆ జట్టు అభిమానులు అతనిని హేజల్-గాడ్ అని పిలుచుకుంటారు.

అలానే, ఐపీఎల్ 2020 నుండి చూస్కుంటే హైదరాబాద్ జట్టు ప్రతి ఏటా ఘోరమైన ప్రదర్శన చూపుతున్న వేల, ఐపీఎల్ 2024 లో ఆ జట్టు కమిన్స్ ను ఇంచుమించు 25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయగా, అతడి రాకతో జట్టు వాతావరణం మారిందనటంలో అతిశయోక్తి లేదు.

ఇలా, కమిన్స్ తో సన్ రైజస్ హైద్రాబాద్, హేజెల్వుడ్ తో ఆర్సీబి జట్లలో జోష్ తెప్పించిన ఈ కంగారులు ఇప్పడు అదే జట్టు అభిమానులను కంగారు పెట్టిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories