మలయాళ మెగా మల్టీస్టారర్ కి ప్యాన్ ఇండియన్ రిలీజ్ ఎందుకొద్దనుకున్నారు ?

Patriot Skips Pan India Release, Malayalam Only

ఈమధ్యకాలంలో ప్రతి సినిమాని ప్యాన్ ఇండియన్ సినిమా అంటూ ఆల్మోస్ట్ అన్నీ భారతీయ భాషల్లో విడుదల చేస్తూనే ఉన్నారు. రేపు (మే 1న) విడుదలవుతున్న మలయాళ మెగా మల్టీస్టారర్ చిత్రం “పేట్రియట్”ను కూడా తొలుత మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేద్దామనుకున్నారు. ఆ మేరకు 6 నెలల క్రితం టీజర్ ను అన్నీ భాషల్లో రిలీజ్ చేశారు కూడా. కానీ.. రేపు కేవలం మలయాళ వెర్షన్ రిలీజ్ అవుతుండడం గమనార్హం.

మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహాద్ ఫాజిల్, కుంచకో బోబన్ మరియు స్టార్ హీరోయిన్లు నయనతార, దర్శన రాజేంద్రన్ వంటి పాపులర్ స్టార్స్ అందరూ యాక్ట్ చేసిన సినిమా ఇది. మలయాళ టాప్ డైరెక్టర్ మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన “పేట్రియట్” సినిమా బడ్జెట్ 125 కోట్ల రూపాయలు.

ADVERTISEMENT

మోహన్ లాల్, మమ్ముట్టిలు చిన్న పాత్రలు పోషించిన సినిమాలనే డబ్బింగ్ రూపంలో ప్యారలల్ రిలీజులకి పోటీపడుతున్న తరుణంలో.. ఇంతమంది కలిసి నటించిన ఒక చిత్రాన్ని ప్యాన్ ఇండియన్ రిలీజ్ చేయకుండా సింపుల్ గా సింగిల్ లాంగ్వేజ్ తో సరిపెట్టడం అనేది గమనార్హం. అది కూడా తొలుత అన్నీ భాషల్లో విడుదల చేసే ప్రయత్నం జరిగాక.

మరి పేట్రియట్ టీమ్ ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. వేరే భాషల్లో పోటీగా పెద్ద సినిమాల విడుదలలు కూడా లేవు. తెలుగు మార్కెట్ అయితే మొత్తానికి డ్రై ఉంది. ఇలాంటి తరుణంలో గోల్డెన్ చాన్స్ ను పెట్రియట్ టీమ్ గాలికొదిలేశారు అనిపిస్తుంది. తర్వాత డబ్బింగ్ వెర్షన్లు రిలీజ్ చేసినా.. అవి ఒరిజినల్ రిజల్ట్ బట్టే ఆడతాయి కానీ, అప్పుడు కాంబినేషన్ కోసం ఎవరూ థియేటర్లకి వెళ్లరు.

మలయాళ “ఎవెంజర్స్, ఎక్స్ పెండబుల్స్” రేంజ్ సినిమా అంటూ ప్రమోట్ చేయబడిన “పేట్రియట్” ఇలా సైలెంట్ గా రిలీజ్ అవుతుండడం అనేది ఓ విధంగా శోచనీయం.

ADVERTISEMENT
Latest Stories