వ్యవస్థలలో చలనం…సంచలనం..!

Pawan Kalyan and Nara Lokesh Make Waves in Government Systems

వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తే వాటి ఫలితాలు ఏ స్థాయిలో ఉంటాయి అనేదానికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వం మంత్రులు. ఒక్క వాట్స్ అప్ సందేశంతో 25 మంది దివ్యంగ విద్యార్థుల జీవితాలను తలక్రిందులు కాకుండా ఆపగలిగారు విద్య శాఖ మంత్రి లోకేష్.

ADVERTISEMENT

IIT , NIT , IIIT లో అర్హత సాధించిన దివ్యంగా విద్యార్థులకు ఇంటర్ మీడియట్ బోర్డు లో చాల కాలంగా అమలులో ఉన్న విధానం వలన ఆ సంస్థలలో అర్హత కోల్పోవాల్సి వచ్చింది. దీనితో ఆ విద్యార్థులలో ఒక్కరు లోకేష్ వాట్స్ అప్ నెంబర్ కు ఒక్క మెసెజ్ చేసారు. ఆ మెసెజ్ కు తక్షణమే స్పందించిన మంత్రి దానికి సంబందించిన అధికారులను అప్రమత్తం చేసారు.

ఆ విద్యార్థుల చదువులకు ఎటువంటి ఆటకం రాకుండా ఎం చెయ్యాలో ఆలోచించాలంటూ అటు అధికారులను పరుగులుపెట్టిస్తూనే, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరుపుతూ నాలుగు రోజులలోనే సమస్యకు జీవో తో సమాధానం చెప్పారు. మాటలు కాదు పనులే సమస్యలకు సమాధానం చెపుతాయి అంటూ నిరూపించారు లోకేష్.

అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కిండుగూడ గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి ఒక పాఠశాల కూడా లేకపోవడంతో స్థానిక ప్రజలందరూ కలిసి ఒక పాకను నిర్మించుకున్న విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ వెంటనే స్పందించి ఆ గ్రామస్తులను అభినందించారు. అలాగే ఆ గిరిజన ప్రాంతంలో వెంటనే పాఠశాల కు ఒక భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

బలమైన వ్యక్తుల చేతులో వ్యవస్థలు పనిచేస్తే సమస్యలకు పరిష్కారం ఇలా దొరుకుతాయా అనేలా కూటమి ప్రభుత్వంలో మంత్రులు పని చేస్తున్నారనే చెప్పాలి. 9 నెలల నుంచి పరిష్కారం దొరకని ఒక సమస్యను 9 రోజులలో పరిష్కరించి చూపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

గత ఐదేళ్లుగా ఒక వ్యవస్థలో కూరుకుపోయిన అవినీతిని మంత్రి పదవి చేపట్టిన 10 రోజుల నుంచి తవ్వి తీస్తున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ చలనం లేకుండా కుర్చీలకే పరిమితమయితే ఈ ప్రభుత్వంలో వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ సంచనాలను సృష్టిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories