జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు తనకి ఇబ్బంది కలిగించకుండా ఏవిదంగా రాజకీయాలు చేసుకోవాలో చెపుతుండేవారు. టీడీపీ, జనసేనలు, టీడీపీ, బీజేపిలు పొత్తులు పెట్టుకోవడం నేరమని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వేర్వేరుగా పోటీ చేయాలని సూచిస్తుండేవారు.
పదవి, అధికారం కోల్పోయిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఏవిదంగా పనిచేయాలో రోజూ తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి చెపుతుంటారు. తాను అమలుచేసిన సంక్షేమ పధకాలన్నిటినీ యధాతధంగా అమలుచేయాలని, లేకుంటే అది ప్రజలను మోసం చేయడమే అని తీర్పు చెపుతుంటారు. కానీ చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన అమరావతిని తాను పూర్తిచేయలేదనే విషయం గుర్తులేనట్లు నటిస్తుంటారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలోనూ ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు తెల్ల రేషన్ కార్డులు బియ్యం పౌర సరఫరా శాఖ నుంచి, గోదాములలో నుంచి మాయం చేసి కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసి అమ్ముకున్నారు. కానీ ఆ విషయం తెలియనట్లు వాహనాలు కొనుగోలు చేసతెవచ్చే కమీషన్ల కోసమో, లేదా ఓటు బ్యాంకు పెంచుకునేందుకో ఇంటి గుమ్మం వద్దకే రేషన్ సరుకులు తెచ్చి అందిస్తామంటూ 1,600 కోట్లు ఖర్చు చేసి వాహనాలు కొనుగోలు చేశారు. వాటి కోసం వేలమందిని నియమించారు.
అయితే రాష్ట్రంలో ప్రతీ పట్టణం, గ్రామంలో అనేక రేషన్ షాపులు, వాటిలో వేల మంది ఉండగా మళ్ళీ వాహనాలు, వాటికి సిబ్బంది ఎందుకని జగన్ అనుకోలేదు.
నేటికీ ఆ వాహనాలు, సిబ్బంది అలాగే ఉన్నప్పటికీ వారందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగించేసి రోడ్డున పడేశారని వైసీపీ సోషల్ మీడియాలో రోజూ దుష్ప్రచారం చేస్తూనే ఉంది. ఆ వాహనాలపై జగన్ ఫోటోలు తొలగించినందునే ఈ కడుపు మంట అని చెప్పవచ్చు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ విమర్శలకు జవాబు చెపుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఈరోజు ఓ పోస్ట్ పెట్టారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..
“ఇకపై నెలలో 15 రోజులపాటు… రోజు రెండు పూటల… చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి, ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసి, ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతోమంది పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బందులుపడ్డారు.
ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని, చిరుద్యోగాలకి సెలవు పెట్టుకోవాల్సి వచ్చేది. మిగిలిన రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbnగారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకుంది.
వీటిని అరికట్టేందుకు, ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచు 15 వ తేదీ వరకు.. ఉదయం 8 గం.ల నుంచి 12 గం.ల వరకు అలాగే సాయంత్రం 4గం. ల నుండి 8 గం.ల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందించనున్నాము.
దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా, ప్రతీ ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా దివ్యాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు నేతృత్వంలో ఈ కార్యక్రమం జనరంజకంగా అమలవుతుందని ఆకాంక్షిస్తున్నాను. ఈ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను” @PawanKalyan






