రాజకీయాలు సినిమాలు రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ పవన్ చాల బ్యాలెన్సింగ్ ధోరణిలో ముందుకెళుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాల కన్నా తన మొదటి ప్రాధాన్యత రాజకీయాలే అంటూ సమయం చిక్కినప్పుడల్లా తన అభిమానులను పరోక్షంగా చెపుతూనే వస్తున్నారు పవన్.
అయినా ఆయన చెప్పిన దాన్ని కనీసం అవగాహన చేసుకునే స్థితిలో కొంతమంది పవన్ అభిమానులు లేకపోవడం పవన్ కు అసహనాన్ని తెప్పిస్తుంది. నేడు కడప జిల్లా పర్యటనలో భాగంగా వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపిడివో జవహర్ బాబు ని పరామర్శించిన పవన్ ఈ దాడి ఘటనను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతున్నారు.
Also Read – ఈ ఏడాది ఏపీకి అంతా శుభం… పండుగ చేసుకోవలసిందే!
వైసీపీ ఓడిపోయినప్పటికీ ఇంకా తన ఆధిపత్యం కోసం అహంకారంతో చేస్తున్న ఇటువంటి దాడులను ప్రభుత్వం చూస్తూ ఉరుకోబోదని, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని, అధికారుల పై ఈ రకమైన దాడులకు తెగబడుతున్న వైసీపీ నేతల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు ఉప ముఖ్యమంత్రి పవన్.
ఇటువంటి కీలకమైన ప్రెస్ మీట్ లో చాల ఆవేశంగా పవన్ తమ ప్రత్యర్థి పార్టీ వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలు పంపుతున్న సమయంలో, అక్కడ పవన్ ను చూడడానికి వచ్చిన ఆయన అభిమానులు సందర్భం లేకుండా ఒక వ్యక్తి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పరామర్శకు వచ్చిన పవన్ ను ఉద్దేశించి OG ,OG అంటూ సినిమా స్లోగన్స్ చేస్తున్నారు.
Also Read – M9 పాఠకులకు ‘భోగి’ పండుగ శుభాకాంక్షలు..!
దీనితో విసుగు చెందిన పవన్ తన అభిమానుల పై అసహనాన్ని వ్యక్తం చేసారు. ఇక మీకు సమయం సందర్భం తెలియదా.? ఎప్పుడు ఏ స్లొగన్స్ ఇవ్వాలో కూడా అర్ధం కాదా.? ఏంటయ్యా మీరు, పక్కకి రండి అంటూ తన అభిమానులను వారించారు. మొన్నీమధ్య అరకు మన్యం ప్రాంతాల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా పవన్ ను చూసిన ఆయన అభిమానులు సీఎం..సీఎం అంటూ నినాదాలు చేసారు.
అప్పుడు కూడా పవన్ ఇదే విధంగా వారి అభిమానులకు హిత బోధ చేసే ప్రయత్నం చేసారు. నేను సీఎం కాదు డిప్యూటీ సీఎం ని, బాబు ఈ డిప్యూటీ సీఎం పదవితో తనను గౌరవించారని, తనను సీఎం..సీఎం అంటూ ముఖ్యమంత్రి బాబు ని తగ్గించవద్దంటూ తన అభిమానులకు వాస్తవ పరిస్థితులను వివరించారు.
Also Read – సంక్రాంతికి వస్తున్నాం అన్నారు.. మరిచిపోకండి సార్లూ
అలాగే పవన్ రాజకీయ పర్యటనలకు, సభలకు వస్తున్న అభిమానులు ప్రభుత్వం తరుపున తాము చేస్తున్న మంచిని ప్రజలకు వివరించే కార్యక్రమాలలో కూడా ఇదే తరహా OG ,OG అంటూ సినిమా స్లోగన్స్ ఇస్తున్నారు.164 సీట్లతో అధికారాన్ని అందించిన కూటమి ప్రభుత్వం మీద చాల పెద్దబాధ్యతే ఉందని, ఆ దిశగా గాడి తప్పిన పాలనా వ్యవస్థను గాడిన పెట్టడానికి అందరు సర్వ శక్తులు ఒడ్డుతున్నామని,
ఆ కారణంగా తన సినిమాలకు కాస్త సమయం ఇవ్వాలంటూ పవన్ తన అభిమానులను కోరినప్పటికీ ఇలా పవన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ OG ,OG అంటూఉంటునే అది చివరికి తమ అభిమాన నటుడు పవన్ కే చిరాకును తెప్పించింది. ఇప్పటికైనా ఆయన ఆలోచనలను అర్ధం చేసుకుని ఆయన రాజకీయంగా ఎదగడానికి ఈ అభిమానం ఆటంకం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అభిమానుల మీదే ఉంటుంది అనేది గ్రహించాలి.
గతంలో సినిమా ఫంక్షన్లలో కూడా ఇదే తరహాలో స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నా పవర్ స్టార్..పవర్ స్టార్ అంటూ అరుస్తూ చివరికి ‘చెప్పను బ్రదర్’ అనే వివాదానికి పునాది వేశారు. ఇక ఇప్పుడు ఇలా రాజకీయ వేదికల మీద అర్ధం పర్ధం రచ్చ చేస్తూ ఇక ఎప్పటికి వీళ్ళకి మెచ్యూరిటీ రాదా అనేలా ప్రవర్తిస్తున్నారు.