అమరావతిని ఆపబోతున్నారా? పవన్ కళ్యాణ్ కు సమాచారం ఉందా?

Pawan-Kalyan-Jana-Sena-Amaravatiఉగాది పర్వదినాన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని తుళ్లూరు మండల పరిధిలోఉన్న ఉద్దండరాయుని పాలెం, లింగాయ పాలెం లంక భూములను పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయుని పాలెంలోని ఎస్సీకాలనీలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పవన్‌ పాల్గొన్నారు.

ఐతే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఒక రాజధాని నిర్మాణానికి రెండు దశాబ్దాల సమయం పడుతుంది… వచ్చే ఏడాదిలో రాజధానిలో అనేక సమస్యలు వస్తాయి… మాస్టర్‌ ప్లాన్‌పై అనేక మార్పులు వస్తాయి, ఇప్పుడు చూపించే మాస్టర్‌ ప్లాన్‌ ఫైనల్‌ కాదు,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ADVERTISEMENT

వచ్చే ఏడాదిలో అమరావతికి అనేక సమస్యలు రావడం ఏంటి? అమరావతిని కేంద్రం గానీ ఆపబోతుందా? దీనిపై ఏదైనా నిర్దిష్టమైన సమాచారం పవన్ కళ్యాణ్ కు ఉందా? ఉంటే పవన్ కళ్యాణ్ కు బీజేపీకు ఉన్న సంబంధం ఏంటి? ఇలా అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories