జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నాయకుల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో విజయవాడ ఎంపీ కేశినేని నాని చేరారు. బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… చిరంజీవిది పోస్ట్‌పెయిడ్ పార్టీ.., పవన్‌ది ప్రీపెయిడ్ పార్టీ అన్నారు. విభజన సమయంలో అన్న చిరంజీవిని ప్రశ్నించలేని పవన్‌కల్యాణ్… చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
బీజేపీకి పోయే కాలం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారన్నారు. ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందన్నారు. అయితే ప్రజలు ఆ అవకాశం ఇవ్వరని ఆయన చెప్పారు. గతంలో రెండు మూడు సందర్భాలలో పవన్ కళ్యాణ్ కేశినేని నాని పై విమర్శలు చేసారు.
అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ మీద తీవ్ర ఆరోపనలు చేసి బయటకు వచ్చారు నాని. 2014 ఎన్నికలలో విజయవాడ ఎంపీ సీటు తన సన్నిహితుడైన పీవీపీ కి ఇప్పిద్దామని చూసినా దానికి నాని అడ్డు పడ్డారు. అది మనసులో పెట్టుకునో ఏమో పవన్ కళ్యాణ్ నానిపై పలు సందర్భాలలో విమర్శలు చేసారు.



