పవన్ పై విమర్శలు: వై ఓన్లీ రెడ్డీస్.?

Pawan Kalyan’s Konaseema comments triggering reactions from BRS and Congress leaders

ఏలూరు పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది అనే వ్యాఖ్య తెలంగాణలో రాజకీయానికి ఊతమిచ్చింది. ఒక ఉపముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారా.?

ఇటువంటి వారు డిప్యూటీ సీఎం పదవికి అనర్హులు అనేలా బిఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అదలా ఉంటే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన వెంటనే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

ADVERTISEMENT

కోనసీమకు తెలంగాణ దిష్టి తగలడానికి ఇక్కడి వారెవ్వరు హైద్రాబాద్ వదిలి ఉపాధి కోసం కోనసీమ వెళ్లడం లేదు, అక్కడి వారే నిత్యం వేలాది మందిగా హైద్రాబాద్ కి వలస వస్తున్నారు అంటూ బిఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడగా,

ఇక ఇప్పుడు మా దిష్టి కోనసీమకు తగిలితే పవన్ అక్కడ గెలిచేవారా.? పవన్ తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటూ పవన్ వ్యాఖ్యనించడం ఏమాత్రం సబబు కాదు అంటూ కాంగ్రెస్ జనంపల్లి ఎమ్మెల్యే అనిరుధ్ విరుచుకుపడుతున్నారు.

అయితే తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నుంచి ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ పవన్ ను విమర్శించేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు పార్టీల నుండి కేవలం రెడ్డి సామాజికవర్గం మాత్రమే ఎందుకు ముందుకొచ్చింది.?

ఏపీలో తమ సామాజికవర్గం నాయకుడి ఓటమిలో, వైసీపీ పతనంలో పవన్ కీలక పాత్ర పోషించడమే తెలంగాణలో రెడ్డి సామాజికవర్గానికి కూడా మింగుడు పడడం లేదా.? ఆ విద్వేషాన్ని ఇలా సందర్భానుసారంగా వెల్లడించాలని రెడ్డి సామాజికవర్గం నేతలు కంకణం కట్టుకున్నారా.?

అందుకు తోడు బిఆర్ఎస్ వైసీపీ మిత్రపక్షం వంటిది అందుకే బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఇటు స్వకార్యం అటు స్వామి కార్యం పూర్తి చేసేందుకే తోలి అడుగు వేసి మీడియా ముందుకొచ్చి పవన్ వ్యాఖ్యల పై విరుచుకుపడ్డారా.? ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం జగదీశ్ రెడ్డి ను అనుసరిస్తూ పవన్ ను ఆటర్గెట్ చేసేందుకు సిద్దపడ్డారా.?

ADVERTISEMENT
Latest Stories