వైఎస్సాఆర్ కాంగ్రెస్ తిరుపతి ఎంపీ వరప్రసాద్ తాను ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలిసినట్టుగా తెలిపారు. “ఇటీవలే పవన్ ఫోన్ చేసి కలవాలని అడిగితే వెళ్లి కలిశా. వైసీపీ ఎందుకు తనపై విమర్శలు చేస్తోందని పవన్ అడిగారు. టీడీపీకి మద్దతుగా మాట్లాడుతున్నందునే విమర్శలు చేశామని చెప్పా,” అని ఆయన అన్నారు.
“టీడీపీతో లేనని, అవసరమైతే జగన్ కు మద్దతు ఇస్తానని పవన్ తెలిపారు. ఎన్నికల తరువాత పవన్ మద్దతు మాకే ,” అని ఆయన మీడియాకు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఆమరణ నిరాహార దీక్ష కు, హోదా కోసం జనసేన చేసే అన్ని ప్రయత్నాలకు తమ పార్టీ మద్దత్తు ఉంటుంది అని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు కాస్త ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సదరు ఎంపీని సీక్రెట్ గా కలవాల్సిన అవసరం ఏముంది. ఎంపీ వరప్రసాద్ మొన్న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ను కూడా కలిశారు. అదే రోజు టీడీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి తరువాత దానిని రద్దు చేసి అదే విషయంగా వరప్రసాద్ ని కలవడం వివాదాస్పదం అయ్యింది.



