
2024 ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్‌ని శాసనసభలో అడుగుపెట్టనీయమని, ఆయన శాసనసభ గేటుని కూడా తాకనీయమని జగన్, వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికారు.
కానీ ఏం జరిగిందో అందరూ చూశారు. ఇప్పుడు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలే శాసనసభలో అడుగుపెట్టడానికి భయపడుతుంటే, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.
Also Read – వైసీపీ చీకటి మెయిల్స్…
అయితే నేటికీ జగన్‌తో సహ చెవిరెడ్డి, అంబటి, రోజా, పేర్ని, గుడివాడ తదితరులు “మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని, అప్పుడు అందరి తాట తీస్తామని, విదేశాలకు పారిపోయినా కాలర్ పట్టుకొని ఈడ్చుకువచ్చి, ఒక్కొక్కరి గుడ్డలూడదీసి రోడ్‌పై నిలపెడతామని బెదిరిస్తూనే ఉన్నారు.
ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్లు వారికి డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా జవాబిచ్చారు.
Also Read – లేని వారి కోసం పోస్టులు..ఉన్న వారి పై కేసులా..?
ఈరోజు ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లు వ్యయం కాగల తాగునీటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ జరిగిన సభలో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,”సామాన్య ప్రజలని, ఉద్యోగులను, అధికారులను మీరు ఐల బెదిరించబట్టే అందరూ కలిసి మిమ్మల్ని గద్దె దించేశారు. అయినా మీకు జ్ఞానం రాలేదు.
2029లో అధికారంలోకి వస్తే మా అందరి అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. మీరు అధికారంలోకి ఎలా వస్తారో నేనూ చూస్తాను. 2024 ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో వైసీపీని గెలవనీయనని చెప్పాను. గెలవకుండా అడ్డుకున్నాను.
Also Read – రాజకీయాలలో మెట్టు దిగడం.. ఇలా కాదు!
ఇవాళ్ళ నేను చెపుతున్నాను.. వినండి 2029లో కూడా వైసీపీని గెలవనీయను. నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం లేదు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు గూండాగిరీ, రౌడీయిజం చేస్తునప్పుడు మీ అందరినీ గద్దె దించాల్సిన సమయం వచ్చేసిందని అనుకున్నాను. దించేశాను. మళ్ళీ ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తున్నారు. కనుక మళ్ళీ చెపుతున్నాను. 2029 ఎన్నికలలో కూడా వైసీపీని అధికారంలోకి రానీయను,” అని డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ శపధం చేశారు.