బెయిల్ మీద ఉన్నోడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి…! ఇదే మనరాష్ట్ర దోర్భగ్యం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తే రాష్ట్రంలో “లా అండ్ ఆర్డర్” పరిస్థితి ఎంతగా దిగజారిపోతుంది అనేదానికి మచ్చుతునకలే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న దుస్థితి అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అతి కిరాతకంగా సొంత బాబాయిని గొడ్డలి వేటు వేసినవారు రాష్ట్రంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా తిరుగుతున్నారు., కానీ ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలను నిలదీస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం రాష్ట్రానికి రావాలన్న.., తమ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్న “అనుమతులు – ఆంక్షలు” అంటూ నానా యాగీ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
దేశంలో కోర్టులు చట్టాలు సక్రమంగా పనిచేసినట్లయితే జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవారేనా..? తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని వేలాది కోట్లు దోచుకుని., అవినీతి కేసులో పదహారు నెలలు జైలు జీవితం గడిపి., బెయిల్ మీద తిరుగుతూ రాజ్యాధికారం పొంది చివరకు సాధించింది ఏమిటి అంటే రాష్ట్రంలో అల్లర్లు – కక్ష సాధింపు రాజకీయాలు., అంటూ పవన్ బాబుకి తన మద్దతు తెలియ చేశారు.
చంద్రబాబు అరెస్ట్ ని ఖండించిన పవన్ తన మద్దతు బాబుకి ఎప్పుడు ఉంటుందని.., రాష్ట్ర రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న.., పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికే ఇటువంటి పరిస్థితులు తీసుకువచ్చారని.., నేరచరిత్ర ఉన్న వ్యక్తులు రాజ్యంగ పదవిలో ఉంటె ఇటువంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలంటూ విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి మోడీ దేశానికే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G-20 సదస్సు యొక్క ఆలోచన కూడా రాష్ట్ర ప్రజలకు చేరకుండా.., మీడియాలో ఆ సదస్సు తాలుక చర్చ కూడా జరగకుండా వైసీపీ ప్రభుత్వం ఇంత రద్దీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించడం కేంద్ర పెద్దలు కూడా ఒక్కసారి పునరాలోచించుకోవాలంటూ.., తన మద్దతు బాబు కి ఎప్పుడు ఉంటుందని పవన్ బీజేపీ పెద్దలకు తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో అధికారం ఏ ఒక్కరి సొంతం కాదు…! అధికారం అడ్డుపెట్టుకుని వైసీపీ పెద్దలు ఇటువంటి చర్యలకు పాల్పడితే అది ప్రతిపక్ష నేతలకే బలం చేకూర్చినట్టవుతుంది అనేది జగన్ గుర్తెరిగితే మంచిదని..,రేపు ప్రభుత్వాలు మారితే మీరు చేసిన దోపిడీకి మీకు రాజ్యంగ బద్దంగానే శిక్షలు ఉంటాయని.,మిమ్మల్ని మేము వదుల్తామా? అన్ని గుర్తుపెట్టుకొంటాం.! అంటూ జగన్ కు తనదైన స్టైల్ లో బదులిచ్చారు. జగన్ ఏపీ రాజకీయాలలోకి కక్ష్య పూరిత సంస్కృతులు తీసుకువస్తున్నారనేది ప్రజాస్వామ్య వాదుల భావన.



