పెద్దికి ఇంకా లైన్ క్లియర్ అయినట్లు లేదుగా..

Peddi Release Trouble

సరిగ్గా 12 రోజుల్లో “పెద్ది” రిలీజ్ కానుంది. ఇవాళ భోపాల్ లో రెహమాన్ తో కాన్సర్ట్ నిర్వహిస్తూ ప్రమోషన్ పనుల్లో ఉన్నారు చిత్రబృందం. అయితే.. ఇక్కడ తెలంగాణలో మాత్రం “పెద్ది” సినిమాకి కొత్త అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రెండు వారాల క్రితం ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్, దిల్ రాజు కలగజేసుకుని ఆ గొడవను సర్దిచెప్పి “పెద్ది” రిలీజ్ కి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో అంతా క్లియర్ అనుకున్నారు.

కట్ చేస్తే.. ఇవాళ (మే 23) హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరూ ప్రెస్ మీట్ పెట్టి మరీ మూకుమ్మడిగా “పెద్ది సినిమాకి ఆంధ్రాలో హైక్స్ ఉంటాయి కానీ.. తెలంగాణాలో మాత్రం ఉండవు. అలాగే.. పర్సంటేజ్ సిస్టమ్ కి ఒప్పుకోకపోతే.. తెలంగాణలో ఏ సినిమా సింగిల్ స్క్రీన్లలో ఆడనివ్వం. అది పెద్ది కూడా కావచ్చు” అని గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే కాకుండా.. తెలంగాణ ముఖ్యమంత్రికి టికెట్ రేట్స్ పెంచకూడదు అని లెటర్ రాశాం అని చెప్పడం ఈ ఇష్యూకి ఇంకాస్త సీరియస్ నెస్ తీసుకొచ్చింది. అంతే కాకుండా.. ఇప్పుడు ఉన్నది తెలుగు ఫిలిం ఛాంబర్ కాదని, గిల్డ్ ఫిలిం ఛాంబర్ అని, వాళ్లే అంతా ఉన్నారు. మేం వాళ్ల ముందు తక్కువ ఉన్నాం అంటూ చేసిన కామెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

ADVERTISEMENT

నైజాం మార్కెట్ అనేది తెలుగు సినిమాకి బిగ్గెస్ట్ మార్కెట్. దాదాపు 60% రెవెన్యూ ఇక్కడి నుండే ఒక సినిమాకి వస్తుంది. అలాంటిది తెలంగాణలో టికెట్ హైక్స్ రానివ్వం, పర్సంటేజ్ సిస్టమ్ కి ఒప్పుకోకపోతే.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సదరు సినిమాలు సినిమాల్ని ఆడనివ్వం అంటూ తెలంగాణ ఎగ్జిబిటర్లు కరాఖండిగా తీర్మానించడం అనేది “పెద్ది” సినిమాకి మాత్రమే కాదు.. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద తలపోటు. ఈ విషయంలో గిల్డ్ సభ్యులు లేదా ఇండస్ట్రీ పెద్దలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories