తెలుగు నాట సంక్రాంతి సందడి మొదలయ్యింది. రోడ్లన్నీ వాహనాలతో, బస్, రైల్వే స్టేషన్లన్నీ ప్రజలతో కిక్కిరిసి పోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలు ఇలా ఈ సంక్రాంతి పండుగను తమ సొంత ఊరులో, సొంత కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడానికి ఉపాధి కోసం వలస బాట పట్టిన ఎందరో ప్రజలు సంక్రాంతి కష్టాలను మోస్తున్నారు. ‘
అయితే ఇక్కడ ఇలా ఇంతమంది తెలుగు ప్రజలు తమ సొంత ఊరిని, ఉన్న రాష్ట్రాన్ని వదిలి ఉపాధి లేక ఉద్యోగాల నిమిత్తం పొరుగు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళుతున్నారా.? అన్న ప్రశ్న భవిష్యత్ తరాన్ని భయపెడుతుంది. ఆలోచింపచేస్తుంది.
గత కొన్ని జనరేషన్స్ నుంచి కూడా భారత దేశం ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ అని ఎలా అయితే చెప్పుకుని సరిపెట్టుకుంటున్నామో ఇక్కడ కూడా అదే పరిస్థితి. కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రజలు ‘తమ కోసం కాదు తమ పిల్ల భవిష్యత్ కోసం’ అంటూ సర్ది చెప్పుకుంటూ సొంత ఊర్లకు సెలవు చెపుతున్నారు, వలస బాట పడుతున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సంస్కృతీ కి ముగింపు దొరకదా.? భవిష్యత్ తరం కూడా ఇంకా పొట్ట చేత పట్టుకుని, చదివిన డిగ్రీలు చంకలో పెట్టుకుని వలస బాట పట్టాల్సిందేనా.? ఉన్న చోట ఉద్యోగం చేసుకునే అవకాశం ఏపీ ప్రజలకు అందని ద్రాక్షేనా.? ఇప్పుడు ఈ ప్రశ్నకే ఐ.టీడీపీ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.
మన సొంత ఊరుని సొంత రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందా కలిసి రండి…అమరావతిని రాష్ట్ర రాజధానిగా, విశాఖను ఐటీ హబ్ గా, రాయలసీమను పారిశ్రామికాభివృద్దిగా పునర్ నిర్మించుకుని ఇక ఈ వలస బతుకులకు శాశ్వత సెలవు ప్రకటిద్దాం… కలిసి రండి అడుగు ముందుకేయండి. “ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి” అనే నినాదం ను ప్రచారంలోకి తెచ్చింది.
అయితే ఐ. టీడీపీ చేసిన ఈ పోస్టు అందరిని ఆలోచింపచేస్తుంది. తెలంగాణ కు హైద్రాబాద్, సైబరాబాద్ అనే రెండు మహా నగరాలు ఎంతోమందికి జీవనాధారాన్ని చూపుతున్నాయి. కాని అటువంటి నగరాలు ఏపీలో మచ్చుకైనా కానరాదు. నాడు బాబు వేసిన అమరావతి అనే పునాది రాయికి వైసీపీ అనే చెద పట్టకుండా ఉంటే కనీసం తరువాత జనరేషన్ యువత కైనా తమ సొంత రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దక్కివుండేవి




