2029 ఎన్నికలకి పేర్ని కిట్టు ట్రెనింగ్… వెరీగుడ్!

Perni Kittu Sparks Row After Clash With Police

సినీ హీరోల కొడుకులు సినిమాలలోకి రావాలనుకుంటే ముందుగా నటన, డాన్స్, గుర్రపు స్వారీ వగైరా నేర్చుకుంటారు. అదే రాజకీయ నాయకుల కొడుకులైతే? సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు! రాంగ్ ఆన్సర్!

అనుచరులను వెంటబెట్టుకొని ఊర్లో రౌడీయిజం చేస్తారు. పోలీసులతో ఘర్షణ పడుతూ అధికారులను బూతులు తిడతారు. రైట్ ఆన్సర్!

ADVERTISEMENT

మాజీ మంత్రి పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు ఇలాంటి రాజకీయ శిక్షణలోనే ఉన్నారిప్పుడు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనని, తన కొడుకు పోటీ చేస్తాడని పేర్ని నాని ఇది వరకే ప్రకటించారు. అప్పటి నుంచి పేర్ని కిట్టు ఈ ట్రెయినింగ్‌ తీసుకుంటున్నారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నం అంటే పేర్ని కుటుంబం అడ్డా. అక్కడ పోలీసుల సాయంతో రెవెన్యూ సిబ్బంది కలిసి అక్రమ కట్టడాలు తొలగిస్తున్నప్పుడు పేర్ని కిట్టు ఎంట్రీ ఇచ్చి, సీఐ శంకర్‌ని ‘ఏం పీకుతావంటూ..’ నోటికొచ్చినట్లు తిట్టారు. చుట్టూ అనేక మంది పోలీసులు, ఎస్సైలు, మీడియా ప్రతినిధులు ఉన్న పేర్ని కిట్టు పట్టించుకోలేదు. నిజానికి వారున్నందునే మరింత రెచ్చిపోయారు.

వైసీపీలో అంబటి రాంబాబు వంటివారు ఇలాగే సిఎం చంద్రబాబు నాయుడుని, పోలీసులను నానా బూతులు తిట్టినందుకు జైలుకి వెళ్ళారు. ఇలాంటి కేసులతో జైలుకి వెళ్ళివస్తే వైసీపీలో అదొక ప్రత్యక అర్హత అవుతుంది. కనుక పేర్ని కిట్టు కూడా వారి బాటలోనే నడుస్తూ రాజకీయ శిక్షణలో భాగంగా పోలీస్ అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించారు.

ఇందుకు కేసు నమోదు చేసి జైలుకి పంపితే 2029 ఎన్నికలలో మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్ధిగా శాసనసభకు పోటీ చేసేందుకు పేర్ని కిట్టు అర్హత సంపాదించినట్లే. లేకుంటే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక ఏదో ఓ కేసు నమోదయ్యే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి.

ఎట్టి పరిస్థితులలో2029 ఎన్నికలలో ఈ రాజకీయ క్షణ పూర్తిచేసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అన్నివిధాల అర్హుడినని నిరూపించుకోక తప్పదు. ఈ రాజకీయ శిక్షణని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటే అది వారి ఖర్మ!

ADVERTISEMENT
Latest Stories