జగన్ పల్నాడు పర్యటన తర్వాత ‘రప్పా రప్పా’ డైలాగ్ చెప్పడంతో అది వైసీపీ నేతలను ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నానికి చాలా స్పూర్తి కలిగించినట్లుంది. అందుకే ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “అరే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలిరా…నోరు తెరిచి ఎన్నిసార్లు రప్పా రప్పా అంటారు?
రప్పా రప్పా అంటే అంతా చీకట్లో జరిగిపోవాలి. తెల్లారిన తర్వాత మీరందరూ వెళ్ళి “అరే ఎలా జరిగింది? ఎవరు చేశారు?” అని అడగాలి. అంతే కానీ రప్పా రప్పా అంటూ డైలాగులు కొడితే సరిపోదు,” అని అన్నారు.
వైసీపీ కార్యకర్తలు “గంగమ్మ జాతరలో పొట్టేలు తలకాయలు నరికినట్లు రప్ప రప్పా తలకాయలు నరికేస్తాం కొడకల్లారా..” అంటూ జగన్ పర్యటనలో ఫ్లెక్సీ బ్యానర్లు ప్రదర్శిస్తే వారిని వారించాల్సిన జగన్ “పిల్లకాయలు సరదాగా సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనా.. ఇలా గడ్డం కింద చేతులు పెట్టినా తప్పేనా?మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?” అని ప్రశ్నించారు.
కోటంరెడ్డి, ఆనంరెడ్డి వంటి సీనియర్ నేతలు గీత దాటారంటూ జగన్ వారిపై నిర్ధాక్షిణ్యంగా వేటు వేశారు. కానీ పార్టీ కార్యకర్తలు ఈవిదంగా వ్యవహరిస్తుంటే వారికి బుద్ధి చెప్పాల్సిన జగన్ వారిని వెనకేసుకువస్తూ మాట్లాడుతున్నారు. అందువల్లే పేర్ని నాని వంటి సీనియర్లు కూడా ఈవిదంగా ప్రత్యర్ధులను రాత్రిపూట చీకటిలో వేసేసి పగలు పరామర్శించాలని కొత్త ఉపాయాలు సూచిస్తున్నారు. యధారాజా తధాప్రజా అంటే ఇదే కదా?
Perni Nani‘s Controversial Speech
"అరే ఎన్నిసార్లు రప్పా రప్పా నరికేస్తాం అని అరవటం కాదు.. చీకట్లో మొత్తం అయిపోవాలి.. తరువాత వెళ్లి ఎలా జరిగింది, ఏంటి అని పరామర్శించాలి"#YSRCP pic.twitter.com/h3YniB7tal
— M9 NEWS (@M9News_) July 12, 2025




