
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం జనాభా, ఓటర్లు, అక్రమాస్తుల కేసులు వగైరా లాభనష్టాల లెక్కలు అన్నీ సరిచూసుకున్న తర్వాత వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా వైసీపీ లోక్‌సభలో ఓటేసి, రాజ్యసభలో మద్దతు ఇచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ రాజ్యసభలో ఏం జరిగిందో తెలీదు కనుక వైసీపీ ఆ బిల్లుని వ్యతిరేకించిందనే అనుకోవచ్చు.
ఇప్పటికే దేశంలో పలుపార్టీలు ముస్లిం ఓట్ల లెక్కలు చూసుకొని ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. వాటిలో వైసీపీ కూడా ఒకటి.
Also Read – గెలిస్తే ఇక్కడి నుండి సమరం, లేదా తిరుగు ప్రయాణం..!
కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. దానిలో మంచి చెడ్డలని పక్కన పెడితే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ చట్టాన్ని వ్యతిరేకించదలిస్తే కేంద్రంతో పోరాడాలి తప్ప దానికి మద్దతు ఇచ్చిన ఎన్డీఏలో పార్టీలతో, వాటి ప్రభుత్వాలతో కాదు.
కానీ ఏపీలో వైసీపీ కూటమి ప్రభుత్వంతో పోరాడుతోంది. రాష్ట్రంలో ముస్లింల ఓట్ల కోసమే వైసీపీ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓట్లు వేసింది తప్ప వారిపై ప్రేమతో కాదని వేరే చెప్పక్కర లేదు.
Also Read – కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?
కనుక వక్ఫ్ బిల్లుకి మద్దతు తెలిపినందుకు సిఎం చంద్రబాబు నాయుడుని ముస్లిం ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే దురాలోచనతోనే విమర్శిస్తున్నట్లు అర్దమవుతోంది.
మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, “దేవాదాయ ధర్మాదాయ శాఖలో, ముఖ్యంగా హిందువులకు పరమ పవిత్రమైన తిరుమలలో అన్య మతస్తులు ఉద్యోగాలు చేయకూడదని, కొండపై ఇతర మతస్తులు వ్యాపారాలు చేసుకోకూడదని చెపుతున్నప్పుడు, వక్ఫ్ బోర్డులో అన్యమతస్థులు పనిచేయవచ్చని ఎలా సమర్ధించగలం?మనం ఒప్పుకోనప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలని ఎలా ఆశించగలం?” అని ప్రశ్నించారు.
Also Read – వైసీపీ బుట్టలో ఎల్ఐసీ… గిలగిలా కొట్టుకుంటోంది పాపం!
వైసీపీ హయాంలో టీటీడీ ఛైర్మన్ మొదలు దిగువ స్థాయి వరకు అన్యమతస్థులతో నింపేసి అపచారాలు చేస్తున్నప్పుడు పేర్ని నాని మనోభావాలు దెబ్బ తినలేదు.
రాష్ట్రంలో ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాలు, రధాలు ధ్వంసం చేస్తున్నప్పుడు ఏనాడూ నోరు విప్పి మాట్లాడలేదు. కానీ వక్ఫ్ చట్టం విషయంలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ వాదిస్తున్నారు.
ఒకవేళ వైసీపీకి నిజంగానే ముస్లింల పట్ల నిబద్దత ఉన్నట్లయితే, వక్ఫ్ చట్టాన్ని నిజంగానే వ్యతిరేకించాలనుకుంటే పేర్ని నాని వంటివారికి నిజంగానే ధైర్యం ఉంటే ప్రెస్‌మీట్ పెట్టి ఈ చట్టాని తెచ్చిన ప్రధాని మోడీ, అమిత్ షాలని, బీజేపిని విమర్శించాలి తప్ప చంద్రబాబు నాయుడుని కాదు. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే జగన్‌తో సహా వైసీపీ నేతలందరూ ఢిల్లీ వెళ్ళి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధర్నాలు, దీక్షలు చేయాలి తప్ప ఏపీలో కాదు.