కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి వ్యవహారం, ఆ తర్వాత మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాములలో నుంచి సుమారు 184 టన్నుల బియ్యం బస్తాలు మాయం అవడంపై మంత్రులు, మీడియా అందరూ మాట్లాడేశారు.
“ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోంది?అసలు ఏం చర్యలు తీసుకుంది?” అంటూ నిలదీశారు.. మరెవరో కాదు ఈ వ్యవహారంలో అందరూ వేలెత్తి చూపుతున్న మాజీ మంత్రి పేర్ని నానియే!
Also Read – ఆ ఇద్దరు కలిస్తే…ఈ ఇద్దరికీ కడుపు మంటేగా.?
ఆయన నేరుగా పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు కొన్ని సూటి ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పాలని నిలదీశారు. ఇంతకీ పేర్ని నాని ఏమడిగారంటే..
1. 2014 నుంచి నేటి వరకు రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన బియ్యం మిల్లర్లకు ఇచ్చినప్పుడు, వారు సకాలంలో మిల్లింగ్ చేసి ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వారిపై ఏమైనా చర్యలు తీసుకుందా? ఎవరిపైనైనా కేసులు కట్టిందా?జరిమానాలు విధించిందా?
Also Read – సైఫ్‌కి టాలీవుడ్ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?
2. అసలు ఈ పదేళ్ళలో ఎంత ధాన్యం మిల్లర్లకు ఇచ్చారు?దానిలో ఎంత బఫర్ గోదాములకు తిరిగి వచ్చింది?రాకపోతే మీ ప్రభుత్వం వారిపై ఏం చర్యలు తీసుకుంది? రైస్ మిల్లులను సీజ్ చేసి యాజమానులపై కేసులు కట్టిందా?
3. రాష్ట్రంలో మా ఒక్క గోదాములో నుంచి మాత్రమే బియ్యం మాయం అయ్యాయా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బియ్యం గోదాములలో బియ్యం భద్రంగా ఉందా?ఒకవేళ లేకపోతే ఆయా గోదాముల యాజమానులపై ప్రభుత్వం కేసులు నమోదు చేసిందా లేదా?
Also Read – జగన్ కేసులు: ఉపాధి హామీ పదకాలే.. కొనసాగితేనే బెటర్!
4. ఏయే రైసు మిల్లులకు ఎంత ధాన్యం వెళ్ళింది?దాని కోసం ఎంత అవి ఎంత విద్యుత్ వినియోగించుకున్నాయో లెక్కలు చెప్పగలరా?
5. మీరు 47,000 టన్నుల బియ్యం సీజ్ చేశామని చెప్పారు కదా?ఆ బియ్యం ఎవరివి?ఆ కేసులో ఎవరినైనా అరెస్ట్ చేశారా? చేయకపోతే ఇంతవరకు ఎందుకు చేయలేదు?
6. మా గోదాములో బియ్యం మాయం అయ్యాయని మూడు పెద్ద పత్రికలో బ్యానర్ ఐటంలు ప్రచురించి, వాటిని న్యాయమూర్తులు చూసేలా చేసి, మా కేసు వారి వద్దకు వెళ్ళేసరికి వారు నేను ఓ పెద్ద దొంగని అనుకునేలా చేస్తున్నారెందుకు?
7. మా గోదాములో బియ్యం బస్తాలు తగ్గాయని నేనే లేఖ వ్రాసి తెలియజేసి దానికి డబ్బు కూడా చెల్లించాను. మిగిలిన గోదాములలో ఎక్కడైనా ఇలా బియ్యం మాయం అయితే ఎవరి దగ్గరైనా ఇలా మీ ప్రభుత్వం డబ్బు వసూలు చేసిందా? ఎవరిపైనైనా ఇలా క్రిమినల్ కేసులు నమోదు చేసిందా?
8. న్యాయం ధర్మం కాపాడటం కోసమే పనిచేస్తానని చెప్పారు కనుక మీకు నిజంగా నిబద్దత ఉంటే నేను అడిగిన ఈ ప్రశ్నలన్నీటికీ సమాధానాలు చెప్పాలి.
పేర్ని నాని 2014 నుంచి ఈ అక్రమాలు జరుగుతున్నాయన్నట్లు మాట్లాడారు. కనుక కూటమి ప్రభుత్వం తప్పకుండా ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది.
అయితే ఈ పదేళ్ళలో 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కనుక జగన్, మాజీ మంత్రులు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాల పట్ల కూటమి ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తోందని వాటి శ్రేయోభిలాషులు తరచూ ఆరోపిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు పేర్ని నాని స్వయంగా తమ జగన్ హయంలో రేషన్ బియ్యం గోల్ మాల్ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏం పీకుతోంది?అని నిలదీస్తున్నారు కదా? ఇంకా ఆలస్యం ఎందుకు?