PM Modi To Re-Launch Capital Amaravati Works Again

సవతి తల్లి కైకేయి కోరిక మేరకు, తండ్రి దశరధుడి ఆదేశాలను అనుసరించి 14 ఏళ్ళు అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి రాజ్యం చేరుకున్న సీతారాములకు పట్టాభిషేకం చేసి అయోధ్య బాధ్యతలను అప్పగించిన నాటి రామాయణ గాధ అందరికి సుపరిచితమే.

అలాగే గత వైసీపీ ప్రభుత్వం చూపిన సవతి తల్లి ప్రేమతో , ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న వైస్ జగన్ తన ముర్కత్వంతో ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిని అరణ్యవాసానికి పంపించారు.

Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?

అయితే 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తిరిగి అమరావతికి పట్టాభిషేకం చెయ్యడానికి సిద్ధమయ్యారు. 2015 అక్టోబర్ 22 న దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతికి పునాది రాయి వేసిన బాబు, గత ఐదేళ్ల అమరావతి అరణ్యరోదన తరువాత ఈసారి ఏపీ రాజధానిగా అమరావతిని సుస్థితం చేయడానికి అమరావతి నగరానికి మోడీ చేతుల మీదుగా ‘పట్టాభిషేకం’ నిర్వహించనున్నారు.

2015 లో పునాది రాయి పడిన అమరావతికి 2025 లో అంటే సుమారు పదేళ్ల తరువాత పట్టాభిషేకం జరగనుంది. దీనితో అమరావతి ఒక్కటే ఏపీకి స్థిరమైన, సుస్థిరమైన రాజధానిగా గుర్తింపు పొందనుంది. అమరావతి మీద వైసీపీ పెంచుకున్న ఈర్ష్యా ద్వేషాలకు, జగన్ చూపిన కపట ప్రేమకు అభివృద్ధి వెలుగులతో, పారిశ్రామిక ప్రగతితో విరజిల్లాల్సిన అమరావతి నగరం స్మశానంలా మారిపోయింది.

Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!

మూడు రాజధానులు అనే నిప్పుతో అమరావతిలో వైసీపీ రేపిన మంటలు ఆ పార్టీని రావణుడి లంకను దహించిన అగ్ని మాదిరి పూర్తిగా దహించేశాయి. అలాగే రావణుడి సోదరుడు విభీషణుడు ద్వారా లంక గుట్టు రట్టయినట్టు జగన్ సోదరి వైస్ షర్మిల ద్వారా వైసీపీ గుట్టు మీడియా కెక్కింది. ఇక రావణ చెరలో ఉన్న సీతమ్మ అగ్నితో పునీతమైనట్టు ఐదేళ్లు వైసీపీ అరాచాకాలను చూసిన అమరావతి పట్టాభిషేకంతో పునీతమవ్వబోతుంది.

గత ఐదేళ్లు ఎన్నో అవమానాలు, మరెన్నో అరాచకాలను చూసిన ఆ ప్రాంత ప్రజలు నేడు అభివృద్ధిని, వాటి తాలూకా ఫలాలను చూడనున్నారు. అయితే అందుకు అనుగుణంగా అమరావతి పునర్ నిర్మాణానికి ప్రధాని మోడీకి ఆహ్వాన పత్రిక ఇవ్వనున్నారు ఏపీ ముఖ్యమంత్రి బాబు, ఉపముఖ్యమంత్రి పవన్. దీనితో ఇక అమరావతి కి పట్టాభిషేకం …వైసీపీ కి అరణ్యవాసం అన్నట్టుగా పరిస్థితులు తారుమారయ్యాయి.

Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?

ఇన్నాళ్లు సంక్షేమ బటన్లు నొక్కుతూ అభివృద్ధి చెయ్యలేక, చేతకాక మూడు ముక్కలాటతో సరిపెట్టిన వైసీపీకి ఇప్పుడు అభివృద్ధి బటన్ పవర్ చూపనున్నారు బాబు. అలాగే ప్రముఖ విద్యాసంస్థలైన బిట్స్, ఐఐటీ మద్రాస్ వంటి యూనివర్సిటీలను అమరావతిలో ఏర్పాటు చేసేందు ప్రభుత్వం సంసిద్ధమయ్యింది.

ఇక ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన పనులకు టెండర్లను ఖరారు చేసిన కూటమి ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో అమరావతికి రాజధాని కళను తీసుకురానుంది. రోడ్ల నిర్మాణంతో పాటుగా రాజధాని చుట్టూ ORR , రాజధాని పరిధిలో IRR ల నిర్మాణాలు, పలు కేంద్ర, రాష్ట్ర స్థాయి సంస్థల కట్టడాలు, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రణాళికలు ఇలా అమరావతి వనవాసానికి నేడు కూటమి అన్ని వసతులతో కూడిన పట్టాభిషేకం నిర్వహించనుంది.




అయితే గత ఐదేళ్లు 151 సీట్లతో విర్రవీగిన వైసీపీ అప్పుడే పురుడు పోసుకున్న నాలుగేళ్ళ అమరావతి ని చిదిమేసి పైశాచిక ఆనందాన్ని అనిభవిస్తే, ఆ పాపం 2024 లో వైసీపీ ని శాపంలా వెంటాడి 11 సీట్లకు కుదేసి వైసీపీ అహంకారాన్ని అణిచివేసింది, జగన్ నిరంకుశత్వాన్ని కూకటివేళ్లతో పెకలించింది. అలాగే రాజధానిగా అమరావతి తిరిగి చిగురులు వేసుకుంటూ జీవం పోసుకుంటూ ఒక మహా వృక్షంలా మారనుంది.