ambati-rambabu-and-roja on Cinema Event Issues

వైసీపీ హయాంలో సినీ పరిశ్రమకు పట్టిన ‘రాజకీయ గ్రహణం’ ఇప్పటికి వీడినట్టు కనిపించడం లేదు. ఎప్పుడు ఎదో ఒక వివాదంలో సినీ పరిశ్రమ రాజకీయ వేధింపులను ఎదుర్కొంటూనే వస్తుంది. అయితే ఈ విషాదాలకు సినీ పరిశ్రమ ప్రముఖులు ప్రత్యక్ష కారకులు కాకపోయినప్పటికీ రాజకీయ నాయకులు సృష్టించే వివాదంలోకి మాత్రం ప్రత్యక్ష బాధితులుగా మారుతున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎదురైన వివాదాలలో అప్పుడు బాధితులుగా ప్రభుత్వ పెద్దల ముందు చేతులు జోడించిన తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు నిందితులుగా మారి ప్రభుత్వం ముందు తలవంచుతుంది. అది నాడు పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ ఘటన కావచ్చు, నేడు గేమ్ ఛేంజర్ ఈవెంట్ దుర్ఘటన కావచ్చు.

Also Read – జగన్‌ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!

రెంటిలోనూ ఆ ప్రమాదానికి హీరోలు ప్రత్యక్ష కారకులు కాకపోయినప్పటికీ కొంతమంది రాజకీయ పార్టీల నుంచి రాజకీయ నేతల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు. అయితే నేడు పుష్ప ఘటన కు బన్నీకి మద్దతు పలికిన వైసీపీ నేడు గేమ్ ఛేంజర్ ఈవెంట్ ప్రమాదం పై రాజకీయం మొదలుపెట్టింది.

అలాగే నాడు బన్నీకి వ్యతిరేకంగా గళం విప్పిన మెగా అభిమానులు ఇప్పుడు చెర్రీ కి మద్దతుగా గళం వినిపిస్తున్నారు. ఇక సంధ్యా ధియేటర్ ఘటన మీద గట్టి పట్టుబట్టిన రేవంత్ సర్కార్ ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ బన్నీ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది.

Also Read – ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్నారుగా!

కానీ ఇక్కడ గేమ్ ఛేంజర్ విషాదంలో ఏపీ ప్రభుత్వం ఆ చిత్ర యూనిట్ కు వ్యతిరేకంగా ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు, అలాగే ఈ విషాదంలో రాజకీయ వివాదాన్ని వెతకలేదు టీడీపీ నేతలు. అయితే ఇక్కడ, అక్కడ రెండు కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ ఇచ్చి వైసీపీ మాత్రం సినీ విషాదంలో కూడా రాజకీయ వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది.

అయితే ఇలా సినీ పరిశ్రమ తమ ఈవెంట్లలో ఊహించని విషాదాలను ఎదుర్కొంటు అటు రాజకీయ పార్టీలకు ఆహారంగా మారుతున్నారు. నాడు బాధితులను పరామర్శించకపోవడంలో తప్పులేదంటూ బన్నీకి మద్దతు పలికిన వారు నేడు రామ్ చరణ్ పరామర్శ ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే నాడు బన్నీ వైపు వేలెత్తి చూపిన వారు నేడు చరణ్ తప్పులేదంటూ మాట దాటేస్తున్నారు.

Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్‌ విధ్వంసానికి…


ముఖ్యంగా వైసీపీలో కొంతమంది నేతలు అంబటి, రోజా, శ్యామల వంటి వారి ఈ సినీ విషదాన్ని తమ రాజకీయ లబ్ది కోసం వినియోగించుకుంటూ దీన్ని ఒక రాజకీయ వివాదంగా మారుస్తున్నారు. ఇకనైనా ఈ రాజకీయ నాయకుల కబంద హస్తాల చేతికి చిక్కకుండా సినీ పరిశ్రమ తమ ఈవెంట్ల నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం సినీ పరిశ్రమకు, నటీనటులకు శ్రేయస్కరం.