పక్కింట్లో శవం ఉంటే డప్పుకొట్టి సంబరాలు చేసుకుంటారా..

Ponnam Prabhakar injured in road accidentఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంలో తెలంగాణ కాంగ్రెస్ నుండి అనుకోని మద్దత్తు వచ్చింది. సభలో గొడవ చేస్తూ అవిశ్వాసతీర్మానం చర్చకు రాకుండా చేస్తున్న తరుణంలో గులాబీ పార్టీ మీద వస్తున్న విమర్శలపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ… అవిశ్వాస తీర్మానం పిల్లలాట కాదన్నారు. పక్కింట్లో పెళ్లి అయితే మా ఇంట్లో రంగులు వేసుకోవాల్సిన అవసరంలేదు… అని నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. దీనికి మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రబాకర్ ఘాటుగా స్పందించారు.

ADVERTISEMENT

ఏపీ ఎంపీల అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ డ్రామాలాడుతోందన్నారు. పక్కింట్లో శవం ఉంటే డప్పుకొట్టి సంబరాలు చేసుకుంటారా.. అంటూ పొన్నం పేర్కొన్నారు. అంతేగాక 60ఏళ్లు మనతో కలిసి ఉన్న సోదరులపై మీరు చూపే సంస్కారం ఇదేనా.. అని టీఆర్ఎస్ ఎంపీలను ఆయన ప్రశ్నించారు.

టీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని అని ఆయన ఆరోపించారు. అయితే కాంగ్రెస్ నాయకులకు ఏపీ మీద ప్రేమో లేక తెరాస మీద విమర్శలు చెయ్యాలి కదా అని చేస్తున్నారో. మరోవైపు ఈరోజు కూడా తెరాస, ఏఐఎండీకే సభ్యులు లోక్ సభను స్తంబింపచేశారు.

ADVERTISEMENT
Latest Stories